Volvo: వోల్వో సరికొత్త ఎస్‌90, ఎక్స్‌సీ60 హైబ్రిడ్‌ విడుదల

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ వోల్వో భారత్‌లో ఎస్‌90, ఎక్స్‌సీ60 హైబ్రీడ్‌ కార్ల సరికొత్త మోడల్స్‌ను విడుదల చేసింది. వీటిల్లో ఎస్‌90 ధర రూ.61.9లక్షలు, ఎక్స్‌సీ60  రూ.61.9లక్షలుగా

Published : 19 Oct 2021 21:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వోల్వో సంస్థ భారత్‌లో ఎస్‌90, ఎక్స్‌సీ60 హైబ్రిడ్‌ కార్ల సరికొత్త మోడల్స్‌ను విడుదల చేసింది. వీటిల్లో ఎస్‌90 ధర రూ.61.9లక్షలు, ఎక్స్‌సీ60 రూ.61.9లక్షలుగా నిర్ణయించింది. మరో రూ.75 వేలు చెల్లించి మూడేళ్ల వారెంటీ సర్వీసింగ్‌ స్కీమ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఇంజిన్లను డీజిల్‌ నుంచి పూర్తిగా పెట్రోల్‌కు.. ఆపై ఎలక్ట్రిక్‌కు మార్చాలనే లక్ష్యంలో భాగంగా వీటిని విడుదల చేసింది.  2030 నాటికి వోల్వోలోని ప్రతికారులో ఎలక్ట్రిక్‌ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కార్ల విక్రయాలను రెట్టింపు చేయాలని వోల్వో లక్ష్యంగా పెట్టుకొంది.

ఎక్స్‌సీ60 హైబ్రిడ్‌ కార్‌లో అత్యాధునిక పైలట్‌ అసిస్టెన్స్‌ ఫీచర్‌ను ఇచ్చారు. ఈ కారుకు ఆండ్రాయిడ్‌ ఆధారంగా పనిచేసే టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంది. దీనిలో ఇన్‌ బిల్ట్‌గా గూగుల్‌ యాప్స్‌ ఉంటాయి. దీనికి వాయిస్‌ అసిస్టెంట్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఇక కారుకు 2.0లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. దీనికి 48వాల్ట్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ను జత చేశారు. 8 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను అమర్చిన ఈ కారు 247 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇటువంటి ఫీచర్లతోనే ఎస్‌90లో కూడా పెట్రోల్‌ హైబ్రీడ్‌ మోడల్‌ కార్‌ను అందజేస్తున్నారు. దీనిలో గ్రిల్‌, లోగో,బంపర్స్‌,అలాయ్‌ వీల్స్‌, బాడీ కలర్స్‌ వంటి కొన్ని డిజైన్‌ అప్‌డేట్లతో లభిస్తోంది. దీనికి కూడా 2.0 లీటర్‌ 4 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తోపాటు 48 వాల్ట్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌ మోటార్‌ను జత చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని