11నెలల గరిష్ఠానికి టోకు ఆధారిత ద్రవ్యోల్బణం

జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(డబ్ల్యూపీఐ) 11 నెలల గరిష్ఠానికి చేరింది. 2020, డిసెంబరులో 1.22 శాతంగా ఉన్న ఈ సూచీ.. గత నెలలో 2.03 శాతానికి ఎగబాకింది. కూరగాయ ధరలు పడిపోయినప్పటికీ.....

Updated : 15 Feb 2021 22:31 IST

దిల్లీ: జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(డబ్ల్యూపీఐ) 11 నెలల గరిష్ఠానికి చేరింది. 2020, డిసెంబరులో 1.22 శాతంగా ఉన్న ఈ సూచీ.. గత నెలలో 2.03 శాతానికి ఎగబాకింది. కూరగాయ ధరలు పడిపోయినప్పటికీ.. డబ్ల్యూపీఐ పెరగడం గమనార్హం. పారిశ్రామిక ఉత్పత్తిపై ఆధారపడే పస్తువుల ధరలు గణనీయంగా పెరగడమే అందుకు కారణం. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం గణాంకాలను విడుదల చేసింది.

ఇతర కీలకాంశాలు...

* ఆహార ద్రవ్యోల్బణం మైనస్‌ 2.8 శాతంగా నమోదైంది. గత ఏడాది డిసెంబరులో ఇది మైనస్‌ 1.11 శాతంగా ఉండింది. 
* కూరగాయ ద్రవ్యోల్బణం మైనస్‌ 20.82 వద్ద నిలవగా.. బంగాళాదుంప ధరలు మాత్రం 22.04 శాతం పెరిగాయి. 
* ఫ్యుయల్‌ అండ్‌ పవర్‌ రంగంలో ద్రవ్యోల్బణం మైనస్‌ 4.78 శాతంగా నమోదైంది. 
* ఇక ఆహారేతర పదార్థాల ద్రవ్యోల్బణం జనవరిలో 4.16 శాతంగా ఉంది.
* తాయరీ వస్తువుల ద్రవ్యోల్బణం 5.13 శాతం. డిసెంబరులో ఇది 4.24శాతంగా నమోదైంది.

ఇవీ చదవండి....

ఈ ఏడాది వేతనాలు ఎంత పెరగొచ్చంటే..

ఆరోగ్య బీమా.. ప్రీమియం ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని