WTO: కొత్త వేరియంట్‌ కలవరం.. డబ్ల్యూటీఓ కీలక నిర్ణయం!

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) కీలక నిర్ణయం తీసుకుంది. జెనీవాలో నవంబరు 30న జరగాల్సిన మంత్రుల స్థాయి సమావేశాన్ని నిరంతరాయంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది....

Updated : 27 Nov 2021 14:23 IST

దిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) కీలక నిర్ణయం తీసుకుంది. జెనీవాలో నవంబరు 30న జరగాల్సిన మంత్రుల స్థాయి సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

స్విట్జర్లాండ్‌ సహా అనేక ఐరోపా దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా భేటీ అయిన డబ్ల్యూటీఓ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో తమకు మరో మార్గం లేదని ప్రకటించింది. ఈ నిర్ణయానికి డబ్ల్యూటీఓ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ఇలా 12వ మంత్రుల స్థాయి సమావేశం వాయిదా పడడం ఇది రెండోసారి. ఇది వాస్తవానికి జూన్‌ 2020లో జరగాల్సి ఉంది. 1995 నుంచి డబ్ల్యూటీఓలో భారత్‌ సభ్యదేశంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని