ఏమిటీ ఏటి1 బాండ్స్ (AT1 Bonds)....?

ఈ మధ్య ఎస్ బ్యాంకులో సమస్య తలెత్తినప్పుడు , ఈ నియమాన్ని అవకాశంగా తీసుకుని ఆర్బిఐ , ఎస్ బ్యాంకు తీసుకున్న 'శాశ్వత బాండ్స్ ' (Perpetual bonds) ను రద్దు చేసింది...

Published : 22 Dec 2020 16:00 IST

ఈ మధ్య ఎస్ బ్యాంకులో సమస్య తలెత్తినప్పుడు , ఈ నియమాన్ని అవకాశంగా తీసుకుని ఆర్బిఐ , ఎస్ బ్యాంకు తీసుకున్న 'శాశ్వత బాండ్స్ ' (Perpetual bonds) ను రద్దు చేసింది

ఏ వ్యాపారానికైనా పెట్టుబడి ముఖ్యం. దీనిని ఈక్విటీ రూపంలో తీసుకొస్తారు. ఈక్విటీ లపై ఎటువంటి వడ్డీ చెల్లించనక్కర లేదు. వచ్చిన లాభాల పైకూడా కూడా వీలైనప్పుడే కొంత భాగం చెల్లించవచ్చు. మరికొంత పెట్టుబడిని డెట్ రూపం లో పొందుతారు. ముందే నిర్ణయించిన ప్రకారం దీనిపై వడ్డీ చెల్లిస్తారు.

మన దేశంలోని బ్యాంకులు కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ విధివిధానాలకు తగినట్లుగా మూలధనాన్ని ఏర్పాటుచేసుకోవాలి. టయర్ 1 మూలధనం కింద ఈక్విటీ మూలధనాన్ని సమకూర్చుకుంటాయి. బ్యాంకుల వ్యాపార వృద్ధితోపాటు , వాటి మూలధనం కూడా పెంచుకోవాలి. దీనికోసం ఇవి అదనపు టయర్ 1 కింద ‘డెట్’ ద్వారా మూలధనాన్ని సమకూర్చుకుంటాయి. ఇవి 'శాశ్వత బాండ్స్ ’ (Perpetual bonds) . వీటి అసలును తిరిగి చెల్లించాల్సిన అవసరం వుండదు. ఐతే వీటిపై వడ్డీ అధికంగా ఇస్తారు. అధిక వడ్డీకి ఆశపడి, అధిక రిస్క్ తీసుకునే వారు ఇందులో పెట్టుబడి పెడతారు. ఎస్ బ్యాంకు రూ. 8 వేల కోట్ల ఫై చిలుకు విలువ గల బాండ్స్ ను విడుదల చేసింది.

ఈ మధ్య ఎస్ బ్యాంకులో సమస్య తలెత్తినప్పుడు , ఈ నియమాన్ని అవకాశంగా తీసుకుని ఆర్బిఐ , ఎస్ బ్యాంకు తీసుకున్న 'శాశ్వత బాండ్స్ ’ (Perpetual bonds) ను రద్దు చేసింది. దీని వలన అసలుగానీ, వడ్డీ గానే చెల్లించనవసరం వుండదు . ఇందులో అనేక మ్యూచువల్ ఫండ్స్ అధిక మొత్తంలో పెట్టుబడి చేసాయి. దీనివలన మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ పడిపోయాయి . ఆర్బిఐ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవి ముంబాయి హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసాయి. ఈ 'శాశ్వత బాండ్స్ ’ (Perpetual bonds) ను కొంత విలువ తగ్గించి ఈక్విటీ మార్చమని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని