గోల్డ్ ఈటీఎఫ్‌లు: బంగారం లాంటి అవకాశ
కొద్ది మొత్తాల్లో, కచ్చితమైన తూకంతో, ఎలక్ట్రానిక్ రూపంలో బంగారం కొనే అవకాశాన్ని కల్పిస్తాయి గోల్డ్ ఈటీఎఫ్‌లు....
కొద్ది మొత్తాల్లో, కచ్చితమైన తూకంతో, ఎలక్ట్రానిక్ రూపంలో బంగారం కొనే అవకాశాన్ని కల్పిస్తాయి గోల్డ్ ఈటీఎఫ్‌లు
బంగారంపై భారతీయులకు ఉన్న మమకారం తరతరాల నాటిది. చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు, పేద, మధ్యతరగతి వారు ఒకేసారి ఎక్కువ బంగారాన్ని కొనాలన్నా కష్టంగానే భావిస్తారు. ఇలాంటి వారి అవసరార్థమే కావొచ్చు గోల్డ్ ఈటీఎఫ్‌లు తెరమీదికొచ్చాయి. కచ్చితమైన ధరకు బంగారాన్నియూనిట్ల లెక్క కొనుగోలు చేసి భద్రపరుచుకునేందుకు గోల్డ్ ఈటీఎఫ్ లు చాలా అనుకూలమైనవి. మరి వీటి గురించి వివరంగా తెలుసుకుందాం…
పనిచేసే విధానం:
మదుపర్ల నుంచి సమీకరించిన నిధులను గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ నిర్వాహకులు బంగారంలో పెట్టుబడి చేస్తారు. ఈ ఫండ్లు షేర్ల మాదిరి స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడ్ అవుతాయి. డిమాండు, సరఫరాకి అనుగుణంగా ధర ఎక్స్ఛేంజీలో మారుతుంటుంది. ట్రేడింగ్ జరిగే సమయంలో ఎప్పుడయినా ఈ ఫండ్లను కొనే, అమ్మే వీలు ఉంటుంది. మన ఫండ్ ఎన్ఏవీ బంగారం ధరపై ఆధారపడి ఉంటంది. భౌతికరూపంలో బంగారం తీసుకోకుండా మదుపు చెయ్యడం గోల్డ్ ఈటీఎఫ్ లతో వీలవుతుంది.
యూనిట్ల లెక్క కొనుగోలు:
ఫండ్ నిర్వాహకులు ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తారు. కొన్ని స్కీములు అరగ్రాము చొప్పున కూడా ఇస్తున్నాయి. స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేసి కష్టోడియన్ వద్ద భద్రపరుస్తారు. మనం కొనుగోలు చేసిన యూనిట్ ఒక గ్రాము అనుకుంటే మనం ఎన్ని యూనిట్లు కొనుగోలు చేస్తే అన్నిగ్రాముల బంగారం ఉంటుంది.
ప్రయోజనాలు:
- గోల్డ్ ఈటీఎఫ్ లతో కచ్చితమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. అదనపు ఛార్జీలు ఉండవు.
- భద్రపరుచుకునేందుకు లాకర్ అవసరం ఉండదు. అందుకే దీన్ని పేపర్ గోల్డ్ అని అంటారు.
- మనకు బంగారం అవసరమైనపుడు యూనిట్లను ఎక్స్చేంజీ ద్వారా అమ్మి ఆ డబ్బుతో బంగారాన్ని కొనుక్కోవచ్చు.
- తక్కువ డబ్బుతో బంగారంలో మదుపుచేసే అవకాశం గోల్డ్ ఈటీఎఫ్ లతో వీలవుతుంది. క్రమపద్ధతిలో యూనిట్లను కొనుగోలు చేసుకుంటే కొంత కాలానికి అవసరమైన బంగారాన్ని సమకూర్చవచ్చు.
ధరపై ప్రభావం:
అంతర్జాతీయ వ్యవహారాల మూలంగా బంగారం ధర హెచ్చుతగ్గులకు గురవుతుంది…
అంతర్జాతీయంగా బంగారం ధర డాలర్లలో పరిగణిస్తారు. రూపాయి బలహీనపడినపుడు డాలరుకు ఎక్కువ రూపాయలు మారకం విలువ ఉంటుంది. అంటే రూపాయల్లో చూసుకుంటే బంగారం విలువ పెరుగుతుంది.
డెలివరీ:
కనీసం 10 గ్రాముల నుంచి డెలివరీ తీసుకునే వీలు కల్పిస్తున్నారు. డెలివరీ తీసుకుంటే అదనంగా డెలివరీ ఛార్జీలు వర్తిస్తాయి.
పన్ను విధానం:
- మూడు సంవత్సరాల తర్వాత పెట్టుబడి దీర్ఘకాల మూలధన ఆదాయం పై పన్ను ఇండెక్సేషన్ తో 20శాతం చెల్లించాలి
- మూడు సంవత్సరాల లోపు స్వల్పకాల మూలధన ఆదాయం పై పన్ను చెల్లింపు ఆ వ్యక్తి స్లాబ్ రేటు బట్టి ఉంటుంది.
సూచన: మదుపుచేసే ముందు లిక్విడిటీ ఎక్కువున్న ఫండ్ హౌస్ ని ఎంచుకుంటే మంచిది. దీంతో కావల్సినపుడు యూనిట్లను అమ్మవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ