బీమా పాల‌సీలో ఫ్రీ లుక్ పీరియ‌డ్ అంటే ఏంటి?

ఫ్రీ లుక్ పీరియ‌డ్ గ‌డువు ముగిసిన త‌ర్వాత పాల‌సీ ర‌ద్దు చేసుకుంటే రీఫండ్ రాక‌పోవ‌చ్చు

Published : 22 Dec 2020 20:20 IST

ఆర్థిక స‌ల‌హాదారుడు 14-16 శాతం రాబ‌డి వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో సంజ‌య్ జీవిత బీమా పాల‌సీని తీసుకున్నాడు. రాబ‌డి అనుకున్నంత వ‌స్తుంద‌ని ఆశించాడు. అయితే పాల‌సీ బాండ్ అందుకున్న త‌ర్వాత‌ అర్థ‌మైన విష‌యం ఏంటంటే అత‌డి స‌ల‌హాదారుడు సంజ‌య్‌ను మ‌భ్య‌పెట్టి జీవిత బీమా పాల‌సీకి బ‌దులుగా ఎండోమెంట్ పాల‌సీని విక్ర‌యించాడు. సంజ‌య్‌కి ఆర్థిక విష‌యాల‌పై ఉన్న కొంత అవ‌గాహ‌న‌త ఎండోమెంట్ పాల‌సీలో 14-16 శాతం రాబ‌డి ఉండ‌ద‌ని తెలుసుకున్నాడు. సాధార‌ణంగా అంద‌రు సెక్ష‌న్ 80సీ-గృహ రుణం, ఈఎల్ఎస్ఎస్‌, ట్యూష‌న్ ఫీజు, 80డీ- ఆరోగ్య బీమా వంటి వాటితో ప‌న్ను ఆదా చేసుకుంటారు. అయితే ఇక్క‌డ సంజ‌య్ జీవిత బీమా పాల‌సీని తీసుకున్నాడు. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? పాల‌సీని రిట‌ర్న్ చేయాలా? ఎలా?

ఐఆర్‌డీఏ ఫ్రీ లుక్ పీరియ‌డ్‌:

పాల‌సీ డాక్యుమెంట్ అందిన త‌ర్వాత మొద‌టి 15 రోజుల్లో రిట‌ర్న్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో పాల‌సీ తీసుకుంటే 30 రోజుల్లోపు ఇచ్చేయాలి. వినియోగ‌దారుల‌కు సౌక‌ర్యంగా ఉండేందుకు బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏ ఈ కాలాన్ని ఫ్రీ లుక్ పీరియ‌డ్‌గా ప్ర‌క‌టించింది. బీమా నిబంధ‌న‌ల్లో దీనిని త‌ప్ప‌నిస‌రి చేసింది.

ఫ్రీ లుక్ పీరియ‌డ్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది?

ఫ్రీ లుక్ పీరియ‌డ్ పాల‌సీదారుడు పాల‌సీని కొనుగోలు చేసిన నాటి నుంచి 15 లేదా 30 రోజుల వ‌ర‌కు ఉంటుంది. ఈ గ‌డువులో పాల‌సీని ర‌ద్దు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే దానికి త‌గిన కార‌ణాలు ఉండాలి అవి ఏంటో చూద్దాం…

  • పాల‌సీ గురించిన పూర్తి వివ‌రాల‌ను ఏజెంట్ పాల‌సీదారుడికి తెల‌ప‌క‌పోతే

  • పాల‌సీ ఛార్జీల గురించి

  • కాల ప‌రిమితి

  • మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నాల‌ను

  • ప్రీమియం

  • రిస్క్ క‌వ‌రేజ్ విష‌యాల్లో పాల‌సీదారుడు సంతృప్తిగా లేక‌పోతే ర‌ద్దు చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

ర‌ద్దు చేసుకుంటే ఛార్జీలు:

ఫ్రీ లుక్ పీరియ‌డ్‌లో పాల‌సీని ర‌ద్దు చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కొన్ని ఛార్జీలు మిన‌హాయించి ప్రీమియం తిరిగి రీఫండ్ అవుతుంది. అయితే ఆ కొన్ని

ఎంటంటే…

  • రిస్క్ ప్రీమియం

  • వైద్య ప‌రిక్ష‌ల‌కు అయిన ఖ‌ర్చులు

  • స్టాంప్ డ్యూటీ ఛార్జీలు తిరిగి చెల్లించ‌రు.
    ఫ్రీ లుక్ పీరియ‌డ్ అన్ని జీవిత బీమా పాల‌సీల‌కు వ‌ర్తిస్తుంది. 3 లేదా అంత‌కంటే ఎక్కువ కాల్య‌వ‌ధి ఉన్న ఆరోగ్య బీమా పాల‌సీల‌కు ఉంటుంది.

ఫ్రీ లుక్ పీరియ‌డ్‌కి కాల‌సిన డాక్యుమెంట్లు:

  • ఒరిజిన‌ల్ పాల‌సీ బాండ్‌

  • మొద‌టి ప్రీమియం ర‌శీదు

  • పాల‌సీదారుడి గుర్తింపు ప‌త్రం

  • పాల‌సీదారుడి క్యాన్సిల్ అయిన చెక్కు వంటివి

ఎలా ర‌ద్దు చేసుకోవాలి?

  • ఇది అన్ని ఆరోగ్య‌, జీవిత బీమా పాల‌సీల‌కు ఫ్రీలుక్ పీరియ‌డ్ ఉంటుంది. పాల‌సీ తీసుకున్న త‌ర్వాత స‌మీక్షించుకునేందుకు ఇదొక మంచి అవ‌కాశం

  • క‌నీసం మూడేళ్ల కాల‌ప‌రిమితి ఉన్న ఆరోగ్య‌, జీవిత బీమా పాల‌సీల‌కు ఇది ఉంటుంది. ఈ ఫ్రీ లుక్ పీరియ‌డ్ పాల‌సీ తీసుకున్న‌ప్ప‌టినుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

  • ప‌త్రాల రూపంలో పాల‌సీదారుడు వీటిని అందుకున్నా లేదా డిజిటల్ రూపంలో ఈ-మెయిల్ ద్వారా పాల‌సీదారుడికి వ‌చ్చిన త‌ర్వాత నుంచి ఫ్రీ లుక్ పీరియ‌డ్‌గా చెప్తారు.

  • ఆన్‌లైన్ పాల‌సీకి 30 రోజులు, ఆఫ్‌లైన్ పాల‌సీకి 15 రోజుల ఫ్రీలుక్ పీరియ‌డ్ ఉంటుంది. ఈ గడువులో పాల‌సీ గురించిన నిబంధ‌న‌ల‌ను పూర్తి వివ‌రాల‌ను చ‌దివి స‌మీక్షించుకోవాలి. ఏదైనా సందేహాలు ఉంటే ఏజెంట్ లేదా బీమా సంస్థ‌ను సంప్ర‌దించాలి.

  • పాల‌సీ నిబంధ‌న‌ల‌తో మీరు సంతృప్తిగా లేక‌పోతే పాల‌సీని ర‌ద్దు చేయాల్సిందిగా బీమా సంస్థ‌ను రీఫండ్ కోర‌వ‌చ్చు.

  • పాల‌సీదారుడు నుంచి ర‌ద్దు ప్ర‌తిపాద‌న అందుకున్న త‌ర్వాత బీమా కంపెనీ కొన్ని ప‌ద్ద‌తుల‌ను పాటిస్తుంది. వైద్య ప‌రిక్ష‌ల ఖ‌ర్చులు, స్టాంప్ ఛార్జీలు, రిస్క్ ప్రీమియం వంటి వాటిని తిరిగి చెల్లించ‌దు.

ఈ గ‌డువులోగా పాల‌సీదారుడు స‌మీక్షించుకోక‌పోతే ర‌ద్దు చేసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఈ గ‌డువు దాటిన త‌ర్వాత ర‌ద్దు చేసుకున్నప్ప‌టికీ త‌క్కువ‌గా లేదా మొత్తానికే రీఫండ్ పొంద‌క‌పోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని