పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటీ?

పెట్టుబ‌డుల్లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తుంటే ఆశించిన‌ రాబ‌డిని పొందవ‌చ్చు.......

Published : 19 Dec 2020 14:14 IST

పెట్టుబ‌డుల్లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తుంటే ఆశించిన‌ రాబ‌డిని పొందవ‌చ్చు.​​​​​​​

రీబ్యాలెన్సింగ్ అంటే పెట్టుబ‌డుల కేటాయింపుల్లో స‌మ‌తూకం పాటించ‌డం. రిస్క్‌ను అధిగ‌మించేందుకు పెట్టుబ‌డుల్లో ఈ విధానాన్ని పాటించాలి. పెట్టుబ‌డులకు ఒకే ర‌క‌మైన సాధ‌నాలు కాకుండా వివిధ ప‌ద్ధ‌తుల‌ను ఎంచుకోవాలి. పెట్టుబ‌డులకు వ్యూహ‌త్మ‌కంగా ప్ర‌ణాళిక అవ‌స‌రం. ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోవాలంటే దీనికి అనుగుణంగా పెట్టుబ‌డులు కొన‌సాగాలి.

ఉదాహ‌ర‌ణ‌కు ప్రారంభంలో పెట్టుబ‌డుల‌ను 60 శాతం ఈక్విటీల‌కు, 40 శాతం డెట్‌కి కేటాయిస్తే, ఏడాది త‌ర్వాత పెట్టుబ‌డులు 65-35 శాతంగా ఉండాలి. ఎందుకంటే ఈక్విటీల‌లో రాబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది. దీనినే రీబ్యాలెన్సింగ్ అంటారు. ఏడాది స‌మ‌యంలో పెట్టుబ‌డుల గురించి ఒక అవ‌గాహ‌న కూడా ఏర్ప‌డుతుంది. రీబ్యాలెన్సింగ్ అంటే పెట్టుబ‌డుల‌ను స‌వ‌రించ‌డం. ఒక ద‌శ‌లో ఈక్విటీల‌ను విక్ర‌యించి డెట్ ఫండ్ల‌లో తిరిగి పెట్టుబ‌డులు చేసేవిధంగా ఉండాలి. అదేవిధంగా 3-4 ఫండ్ల‌ను బ్యాలెన్స్ చేసుకోవాలి.

అయితే ఎక్కువ‌గా రీబ్యాలెన్స్ చేయ‌డం కూడా అంత మంచిది కాదు. మీరు ఫండ్ల‌ను అమ్మిన‌ప్పుడు కొనుగోలు చేసిన‌ప్పుడు ఫీజులు, ప‌న్నులు వ‌ర్తిస్తాయి. మూడు నెల‌ల‌కోసారి ఫండ్ల‌ను రీబ్యాలెన్స్ చేస్తుంటే ఖ‌ర్చులు పెరుగుతాయి. త‌క్కువ మొత్తం కోసం అంటే 1-2 శాతం రాబ‌డి కోసం రీబ్యాలెన్స్ చేయ‌డం కూడా అంత మంచిది కాదు. సాధార‌ణంగా సంవ‌త్స‌రానికోసారి పెట్టుబ‌డుల‌ను స‌మీక్షించుకోవాల్సిందిగా ఆర్థిక నిపుణులు సూచిస్తారు. 5-10 శాతం వ‌ర‌కు రాబ‌డి ఎక్కువ‌గా వ‌స్తుంది అనుకుంటే త‌ప్ప పెట్టుబ‌డుల‌ను రీబ్యాలెన్సింగ్ చేయ‌డం త‌గిన‌ది కాద‌ని చెప్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని