బీమా ఆవ‌శ్య‌క‌త గురించి తెలుసుకుందాం!

బీమా ఆవ‌శ్య‌క‌త ఏంటీ, దాని ప్ర‌యోజ‌నాల గురించి మ‌నం ఇప్పుడు తెలుసుకందాం.

Published : 20 Dec 2020 14:14 IST

ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వ్యక్తి కుటుంబం లేదా వ్యాపారానికి రక్షణ కల్పించేదే బీమా. ఉన్నపళాన కుటుంబ సభ్యులు ఆర్థికంగా కుదేలు కాకుండా, వ్యాపారం ముగించకుండా ఉండేందుకు బీమా తోడ్పడుతుంది. ఆకస్మిక సంఘటనలను ఎవరూ ఊహించలేరు. తీవ్ర ఆనారోగ్యం, మరణం, భారీ ఆస్తి నష్టం సంభవించినప్పుడు బీమా ఒక ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో బీమా అవసరాలను తెలుసుకుందాం.

  • బంగారం, స్థిరాస్తి, వివిధ డిపాజిట్లు వంటి వాటిలో రకరకాల పెట్టుబడులు పెడతాం. ఆర్థిక పరిస్థితి, కుటుంబ అవసరాల రీత్యా ఇవన్నీ చేస్తాô. అయితే జీవితం పట్ల ఒక భద్రత గురించి ఆలోచించడం కూడా ముఖ్యమే. ఎన్ని పెట్టుబడులు చేసినా బీమా కేటాయింపుల ద్వారా వచ్చే రక్షణ ప్రత్యేకమైనది. ఆస్తులకు తీరని నష్టం వాటిల్లినప్పుడు ఆ లోటును భర్తీ చేయడం బీమా ద్వారా సాధ్యమవుతుంది.

  • వివిధ వ్యక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీమా సంస్థలు చాలా రకాల బీమా పాలసీలను అందిస్తున్నాయి. జీవిత బీమా, ఎండోమెంట్‌, మనీబ్యాక్‌, రిటైర్‌మెంట్‌, పిల్లల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కేవలం బీమా హామీని నెరవేర్చినా, మిగిలినవి విద్య, వివాహం, ఇంటి కొనుగోలు వంటి వాటికి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ బీమా కల్పిస్తున్నాయి.

  • ప్రమాదాలు, అనిశ్చితి నుంచి రక్షించడంతో పాటు భవిష్యత్తులో మంచి రాబడులనిచ్చే పెట్టుబడిగా కూడా బీమా పాలసీ ఉపయోగపడుతుంది. క్రమానుగత ప్రీమియంలు చెల్లించడం వల్ల మనీబ్యాక్‌, ఎండోమెంట్‌ పాలసీల్లో ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. డబ్బు పొదుపు చేయడం ఒక అలవాటుగా మారేందుకు ఇది తోడ్పడుతుంది. పాలసీ మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తం చేతికి అందుతుంది.

  • ఒక మంచి ఆరోగ్య బీమా పాలసీ ఉంటే తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలు సంభవించినప్పుడు ఒక్కసారిగా డబ్బు కోసం పడే ఇబ్బందులు తగ్గుతాయి. పేరున్న ఆసుపత్రిలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా మంచి చికిత్స పొందే వీలుంటుంది. అయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యుక్త వయసులోనే సరైన ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాల్సిందిగా బీమా నిపుణుల సూచన.

  • పన్ను ఆదా చేసేందుకు సైతం పలు బీమా పాలసీలు చక్కని మార్గంగా ఉంటున్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం చాలా పాలసీలకు చెల్లించే ప్రీమియాన్ని పన్ను మినహాయింపుల్లో చూపించవచ్చు.

బీమా హామీ మొత్తం ఎంత ఉండాలనేది కింది అంశాల ఆధారంగా నిర్ణయమవుతుంది

  • ఎంత మంది కుటుంబ సభ్యులు పాలసీదారుపై ఆధారపడి ఉన్నారు

  • కుటుంబానికి ఏ రకమైన జీవితాన్ని అందించాలనుకుంటున్నారు

  • పిల్లల విద్య, వివాహాలకు ఎంత ఖర్చవుతుంది

  • పెట్టుబడి అవసరాలు

  • ఆదాయ సామర్థ్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని