పీపీఎఫ్ కంటే వీపీఎఫ్ ఎందుకు మేలు?
రాబడి పరంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( పీపీఎఫ్) కంటే స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) మెరుగైన పెట్టుబడి ఎంపిక గా చెప్పాలి..........
పన్ను ఆదా చేసే పెట్టుబడి సాధనం స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) లో ఎలా పెట్టుబడి పెట్టాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కంటే మెరుగైన పెట్టుబడి ఎంపికగాచెప్పేందుకు మూడు కారణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. వేతనం కలిగిన వ్యక్తులు ఆదాయం పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 సీ కింద పన్ను ఆదా చేసేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) లో పెట్టుబడి చేస్తుంటారు. స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) కూడా అవే పన్ను ప్రయోజనాలు, భద్రతను కలిగి ఉంటుంది. పీపీఎఫ్‌లో పెట్టుబడులు ప్రస్తుతం మీరు 8.00 శాతం రాబడి అందిస్తున్నాయి. వీపీఎఫ్ ద్వారా వార్షిక రాబడి 8.55% పొందవచ్చు. ఇది పీపీఎఫ్ కంటే ఎక్కువ. వీపీఎఫ్ అధిక వడ్డీ రేటు ఇవ్వడానికి కారణం ఇది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటుతో సమానంగా ఉంటుంది.
2017-18: వీపీఎఫ్/ ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.55%, పీపీఎఫ్ వడ్డీ రేటు 7.6%-8.0%
2016-17: వీపీఎఫ్/ ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.65%పీపీఎఫ్ వడ్డీ రేటు 8% -8.1%
2015-16: వీపీఎఫ్/ ఈపీఎఫ్ వడ్డీ రేట్లు8.8%పీపీఎఫ్ వడ్డీ రేటు 8.7%
2014-15: వీపీఎఫ్/ ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.75%పీపీఎఫ్ వడ్డీ రేటు 8.7%
2013-14: వీపీఎఫ్/ ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.75%పీపీఎఫ్ వడ్డీ రేటు 8.7%
వీపీఎఫ్ ఈపీఎఫ్ రెండింటి వడ్డీ రేట్లల మధ్య తేడా క్రమంగా పెరుగుతున్నాయి.
వీపీఎఫ్ లో మదుపు చేయడం చాలా సులభం:
పీపీఎఫ్ కోసం తపాలా కార్యాలయానికి లేదా బ్యాంకు బ్రాంచికి వెళ్లాలి. ఖాతాను ఆన్ లైన్ ద్వారా ఆపరేట్ చేయాలి. వీపీఎఫ్ ద్వారా మదుపు చేయడం చాలా సులభం మీ కార్యాలయ ఖాతాల విభాగానికి చెప్తే సరిపోతుంది. ఉద్యోగం కొనసాగినంత కాలం ఏమీ చేయవలసిన అవసరం లేదు. నిర్ణయించిన స్థిర మొత్తం ప్రతీ నెల మీ జీతం నుంచి ఖాతాలోకి జమవుతుంది. మీరు ఉద్యోగం మారినప్పటికీ, మీ ఈపీఎఫ్ / వీపీఎఫ్ ఖాతా ఈపీఎఫ్ఓ - యూఏఎన్ ను ఉపయోగించి బదిలీ చేసుకోవచ్చు. వీపీఎఫ్ లోనూ పీపీఎఫ్ లానే పన్ను మినహాహాయింపు పొందవచ్చు. వీపీఎఫ్ ద్వారా పెట్టుబడి చేసే మొత్తంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్ లో వర్తించిన విధంగానే మూడు మార్గాల్లో(ఈఈఈ) పెట్టుబడిచేసినపుడు, ఉససంహరించేటపుడు,వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు. దీంట్లో ఒక నిబంధన ఉంది. వీపీఎఫ్ విత్‌డ్రాయల్ పై పన్ను మినహాయింపు పొందాలంటే ఆ ఉద్యోగి సర్వీస్ కాలం ఐదేళ్లు మించాలి.
వీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం ఎలా?
మీ ప్రాథమిక జీతం నుంచి ప్రతీ సంవత్సరం వీపీఎఫ్ గా కొంత స్థిర మొత్తాన్ని కేటాయించమని పనిచేసే కార్యాలయ ఖాతాల విభాగాన్ని అడగండి. దానికి సబంధించి ఒక ఫారం నింపమని అడుగుతారు. ఈపీఎఫ్ కింద, మీరు మీ ప్రాథమిక జీతం, డియర్నెస్ అలవెన్స్ (డీఏ) లో 12% తప్పనిసరి అవసరం కావాల్సిన అవసరం ఉంది, అయితే వీపీఎఫ్ఓ గరిష్టంగా 100% ప్రాధమిక జీతం, డీఏ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తుంది. వాటిలో సెక్షన్ 80సీ పన్నువర్తించే ఈపీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, మ్యూ చువల్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ మొదలైన మొత్తం పెట్టుబడుల కింద ఆర్థిక సంవత్సరానికి పరిమితి రూ. 150,000 ఉంటుంది. మీ వీపీఎఫ్ వివరాలు ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో చూసుకోవచ్చు.
ఈపీఎఫ్ వర్తించిన విధంగానే లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. రాజీనామా లేదా 2 నెలలు ఉద్యోగం లేకపోవడం. పాక్షిక ఉపసంహరణ చేసుకునేందకు వీలుంటుంది కానీ ఖాతా తెరిచి కనీసం 5 సంవత్సరాల మించితే ఉపసంహరణ మొత్తం పన్ను మినహాయింపు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా