Updated : 30 Oct 2021 14:17 IST

Mark Zuckerberg: ఇంతకీ జుకర్‌బర్గ్‌ సాస్‌ బాటిల్‌ అక్కడెందుకు ఉంచారు?

నెట్టింట్లో వైరల్‌గా మారిన పోస్ట్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’ మాతృసంస్థ పేరును ఇక ‘మెటా’గా పిలవనున్నారు. ఈ మేరకు పేరు మార్పు సంగతిని ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురువారం వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ఈ వీడియోను ఆయన ఇంట్లో తన లివింగ్‌ రూంలో షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, సామాజిక మాధ్యమాల డేగ కన్ను గురించి తెలిసిందే. వీడియోలో కనిపించిన దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించి.. అందులో వింతగా, భిన్నంగా కనిపించే వాటిని హైలైట్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తుంటారు. తాజాగా జుకర్‌బర్గ్‌ వీడియోలోనూ ఇలాంటిదే ఒకటి కనిపెట్టారు నెటిజన్లు.

జుకర్‌బర్గ్‌ వెనుక ఓ బుక్‌షెల్ఫ్‌ ఉంది. అందులో పుస్తకాల చివరన బీబీక్యూ సాస్‌ బాటిల్‌ ఉంది. దీన్ని గమనించిన నెటిజన్లు.. అది అక్కడ ఎందుకు ఉంది అంటూ అడగడం మొదలెట్టారు. ఇది కాస్త ట్రోల్‌గా మారి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా పుస్తకాల చివర అవి జారిపోకుండా లేదా కింద పడకుండా ఏదైనా బరువైన వస్తువును పెడుతుంటారు. వీటికి ప్రత్యేకంగా స్టాండ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటినే ‘బుక్‌ ఎండ్స్‌’ అంటుంటారు. కొంత మంది ఇంట్లో ఉండే బరువైన వస్తువులను బుక్‌ ఎండ్స్‌గా వాడుతుంటారు.

అయితే, జుకర్‌బర్గ్‌ సైతం సాస్‌ బాటిల్‌ను బుక్‌ ఎండ్‌లా వాడి ఉంటారని కొంతమంది నెటిజన్ల అంచనా! దీనిపై మరికొంత మంది స్పందిస్తూ ఫన్నీగా కామెంట్లు చేశారు. కనీసం బుక్‌ఎండ్‌ కూడా కొనుక్కోలేరా? అంటూ ఆకతాయి ప్రశ్న! ఇక కొంత మంది సామాన్యులు వాడే బ్రాండే జుకర్‌బర్గ్‌ వాడతారా? అంటూ సందేహాలు! ఇంకొంతమందైతే.. ప్రకటనల విషయంలో ఫేస్‌బుక్‌ పనితీరును విమర్శిస్తూ కామెంట్లు చేశారు. ‘బహుశా జుకర్‌బర్గ్‌ బుక్‌ ఎండ్‌ అని వెతికితే.. ఫేస్‌బుక్‌ తన కృత్రిమ మేధతో సాస్‌ బాటిల్‌ను చూపించి ఉంటుంది’ అంటూ ఎగతాళి చేశారు. ఇలా ఫేస్‌బుక్‌ పేరు మార్పును పక్కనపెట్టి, ఇప్పుడు జుకర్‌బర్గ్‌ పుస్తకాల చివరన పెట్టిన సాస్‌ బాటిల్‌ పెద్ద చర్చనీయాంశమైంది. ఇంతకీ కిచెన్‌లో ఉండాల్సిన సాస్‌ బాటిల్‌ను జుకర్‌బర్గ్‌ లివింగ్‌ రూంలో ఎందుకు ఉంచారో? తెలియాల్సి ఉంది!

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని