Wipro Q2 Results: విప్రో నికర లాభంలో 17% వృద్ధి

ఐటీ సేవల దిగ్గజం విప్రో రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 17శాతం పెరిగి రూ.2,930.6 కోట్లకు చేరింది....

Published : 13 Oct 2021 19:17 IST

జూన్‌ త్రైమాసికంలో నియామకాలు 11,475

ఉద్యోగుల వలసల రేటు 20.5%

దిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 17శాతం పెరిగి రూ.2,930.6 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.2,484.4 కోట్లు. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం 30 శాతం పెరిగి రూ.19,667.4  కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 7.8 శాతం వృద్ధి చెందింది. ఐటీ సేవల నుంచి వచ్చే ఆదాయం 29.5 శాతం పెరిగి రూ.19,378.38 కోట్లుగా నమోదైంది.

* సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీలో కొత్తగా 11,475 మంది ఉద్యోగులు చేరారు. వీరిలో 8,150 మంది తొలిసారి ఉద్యోగంలో చేరిన వారు.

* క్రితం త్రైమాసికంలో 15.5 శాతంగా ఉన్న ఉద్యోగుల వలసల రేటు 20.5 శాతానికి పెరగడం కలవరపరుస్తోంది. ఈ ఏడాది 30,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీరంతా 2023 ఆర్థిక సంవత్సరంలో చేరనున్నారు.

* రెండో త్రైమాసిక ఫలితాల పట్ల విప్రో సీఈఓ, ఎండీ థియర్రీ డెలాపోర్ట్‌ హర్షం వ్యక్తం చేశారు. తమ వ్యాపార వ్యూహాలు ఫలిస్తున్నాయనడానికి ఫలితాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీఎస్‌ఈలో గురువారం షేరు 2.01 శాతం లాభపడి రూ.672.35 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని