మహిళా ఆరోగ్య బీమా
మహిళలు తమ బాధ్యతల్లో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు. మహిళలకే ప్రత్యేకమైన ఆరోగ్య బీమా పాలసీల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా ప్రత్యేక ఆరోగ్య బీమా తీసుకునేందుకు మహిళలు మొగ్గుచూపరు. కుటుంబ ఆరోగ్య బీమాలో లేదా సంస్థ అందించే బృంద పాలసీలో సభ్యులుగా ఉన్నాం కదా అని సరిపెట్టుకునేవాళ్లు చాలా మంది తారసపడతారు. ప్రత్యేకించి మహిళలకే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. రొమ్ము క్యాన్సర్, ఆర్థరైటిస్, ఓవేరియన్ పాలీసిస్టోసిస్ లాంటి సమస్యలు మహిళలకే ఎక్కువ. గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలను కన్న తర్వాత అనేక ఆరోగ్య సమస్యలతో సతమత మవుతుంటారు. స్త్రీల సమస్యలను అర్థం చేసుకున్న బీమా సంస్థలు వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పాలసీలు రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చాయి. మహిళలూ చొరవ తీసుకొని తమకెందుకులే అని కాకుండా ఇలాంటి పాలసీ ఒకటి తీసుకోవాలి.
ప్రసూతి సమయంలో…
-
మహిళల జీవితంలో కీలక దశ అయిన ప్రసూతి సమయంలో కలిగే వైద్య ఖర్చులకు బీమా తోడ్పాటునందిస్తుంది.
-
పిల్లలు అనారోగ్య సమస్యలతో జన్మించినా వైద్య ఖర్చులకయ్యే సొమ్ములో 50 శాతం వరకు తిరిగి చెల్లించే వీలుంది.
-
పాలసీదారు అనారోగ్యానికి గురై ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడితే పిల్లలకు రూ.25వేల వరకు చదువుకునేందుకు అయ్యే ఖర్చులు బీమా కంపెనీలే భరిస్తాయి.
తీవ్ర అనారోగ్య సమస్యలకు…
-
21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న మహిళలు ఈ పాలసీలు తీసుకునే అవకాశం ఉంది.
-
తీవ్ర అనారోగ్య సమస్యలైన రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పక్షవాతం, కీళ్ల సమస్యలు, బీపీ, మదుమేహం వంటి వాటికి బీమా కల్పిస్తారు. ఇలాంటి సమయంలో ఆర్థిక భారం పడకుండా ఈ పాలసీలు ఉపయోగపడతాయి.
-
పాలసీ తీసుకున్న మొదటి 90 రోజుల్లోనే తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైనట్లు గుర్తిస్తే ఆ సమయంలో బీమా వర్తించదు. (వెయిటింగ్ పీరియడ్)
-
ఏదైనా ఆనారోగ్య సమస్యలను గుర్తించినప్పుడు 30 రోజుల కంటే ఎక్కువగా జీవించి ఉన్నట్లయితేనే బీమాకు అర్హులవుతారు.
పదవీ విరమణ తర్వాత…
-
కొన్ని కంపెనీలు పాలసీదారులకు పదవీ విరమణ తర్వాత ఆదాయాన్నందించే వెసులుబాటు కల్పిస్తున్నాయి.
-
కొన్ని పాలసీలు జీవితకాలం పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తే, కొన్ని వయో పరిమితి విధిస్తున్నాయి.
ఈ పాలసీ పరిధిలోకి వచ్చే అంశాలు:
-
రోజూ వారి ఆసుపత్రి ఖర్చులు
-
ఐ.సి.యూ లో చేరితే అందుకయ్యే ఖర్చులు
-
ప్రమాదం కారణంగా కలిగే గాయాలకు చేసే కాస్మోటిక్ శస్ర్త చికిత్సలకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీలు చెల్లిస్తాయి.
-
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సాధారణ ఆరోగ్య స్థితికి చేరుకునే వరకూ అయ్యే ఖర్చులకు బీమా వర్తిస్తుంది.
-
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక చికిత్సకయ్యే మందులకు, నర్సింగ్ చార్జీలు బీమా కంపెనీలు చెల్లిస్తాయి.
సాధారణ ఆరోగ్య బీమా పాలసీల లాగానే మహిళలకోసం రూపొందించిన ఈ పాలసీలకూ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80(డీ) కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!