Yamaha Festive Offers: యమహా స్కూటర్లపై పండగ ఆఫర్లు!

దేశీయ వాహన తయారీ సంస్థ యమహా పండగ సీజన్‌ నేపథ్యంలో పలు ఆఫర్లను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ‘రే జెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ’ సహా మరికొన్ని స్కూటర్‌ మోడళ్లపై ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వనుంది....

Published : 11 Sep 2021 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ వాహన తయారీ సంస్థ యమహా పండగ సీజన్‌ నేపథ్యంలో పలు ఆఫర్లను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ‘రే జెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ’ సహా మరికొన్ని స్కూటర్‌ మోడళ్లపై ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వనుంది. అవేంటో చూద్దాం!

ఫాసినో 125 ఎఫ్‌ఐ: ఈ మోడల్‌పై రూ.3,876 వరకు బీమా ప్రయోజనాలు కల్పిస్తోంది. దీనికి బదులు వినియోగదారులు రూ.999 డౌన్‌పేమెంట్‌తో స్కూటర్‌ను తీసుకునే ప్రత్యామ్నాయాన్ని కూడా ఎంచుకోవచ్చు. వీటితో పాటు స్క్రాచ్‌ కార్డ్‌ అండ్‌ విన్‌ పోటీలో కనీసం రూ.2,999 బహుమతిగా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కంటెస్ట్‌లో గరిష్ఠంగా బంపర్‌ ప్రైజ్‌ కింద రూ.1,00,000 వరకు పొందే అవకాశం ఉంది. తమిళనాడులో మాత్రం గరిష్ఠ బహుమతి లేదు.

యమహా రే జెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ: ఈ మోడల్‌ హైబ్రిడ్‌, నాన్‌-హైబ్రిడ్‌ అనే మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. నాన్‌-హైబ్రిడ్‌ వేరియంట్‌పై ఫాసినో 125 ఎఫ్‌ఐకి వర్తించే ప్రయోజనాలే లభిస్తాయి.

ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌: ఈ మోడల్‌ను కొనుగోలు చేసేవారికి రూ.5,000 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. లేదా రూ.999 డౌన్‌పేమెంట్‌ చెల్లించి స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. రూ.6,000 వరకు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ కూడా పొందవచ్చు. స్క్రాచ్‌ అండ్‌ విన్‌ కింద రూ.2,999-రూ.1,00,000 వరకు బంపర్‌ ఆఫర్‌ కూడా అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని