Yamaha Bike: మార్కెట్లోకి యమహా కొత్త ఆర్‌15 @ 1.57 లక్షలు

ప్రముఖ ద్విచక్ర తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) YZF-R15 V3.0లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

Published : 17 Nov 2021 17:04 IST

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) YZF-R15 V3.0లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. YZF-R15S V3 పేరిట దీన్ని తీసుకొచ్చింది. దీని ధరను రూ. 1.57 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ) నిర్ణయించింది. యునీబాడీ సీట్‌తో వస్తున్న ఈ బైక్‌ను YZF-R15 V4తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అథరైజ్డ్‌ డీలర్‌షిప్స్‌ వద్ద విక్రయించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

YZF-R15S V3 బైక్‌ 155సీసీ ఇంజిన్‌తో వస్తోంది. గరిష్ఠంగా 18.6 పీఎస్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. గేర్‌ షిఫ్ట్‌ ఇండికేటర్‌తో కూడిన మల్టీ ఫంక్షన్‌ ఎల్‌సీడీ ఇన్సుస్ట్రుమెంట్‌ క్లస్టర్‌ అమర్చారు. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌తో పాటు సైడ్‌ స్టాండ్‌ తీయకుంటే ఇంజిన్‌ ఆన్‌ అవ్వకుండా ఉండే సదుపాయాన్ని ఇస్తున్నారు.వెనుక వెడల్పాటి టైర్‌ను అమర్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఫీచర్లు కలిగిన YZF-R15 వెర్షన్‌ 3.0..  150 సీసీ విభాగంలో విజయవంతమైందని, YZF-R15 V4 సైతం అదే స్థాయిలో ఆదరణ పొందిందని కంపెనీ ఇండియా గ్రూప్‌ ఛైర్మన్‌ మొటోఫుమీ స్హితారా తెలిపారు. వినియోగదారుల ఆకాంక్షలకు కంపెనీ గౌరవిస్తుందని, వారి కోసమే యునీబాడీ సీట్‌తో R15S V3 తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని