ఆన్లైన్ వేలంలో ఆస్తులు కొనొచ్చు
ఈ-వేలం లేదా ఆన్లైన్ వేలం ద్వారా ఆస్తులను కొనుగోలు చేసే విధానం తెలుసుకున్నారా? దీనికోసం నేరుగా ఆన్లైన్ లో బిడ్ వేయవచ్చు.............
సాధారణంగా వేలం ద్వారా విక్రయాలు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది పురాతన వస్తువులు లేదా పెయింటింగులు లాంటి వాటిని వేలం వేయడం. కానీ వేలం ద్వారా ఆస్తులు కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభించేందుకు అవకాశం ఉంటుందని తెలుసా?
ఫోర్క్లోజర్ ఆక్షన్:
రుణం ద్వారా కొనుగోలు చేసిన గృహ, వాణిజ్య భవనాలకు సంబంధించి ఈఎమ్ఐలు చెల్లించకపోతే ఆ భవనాలను లేదా ఆస్తులను సదరు బ్యాంకులు లేదా రుణసంస్థలు వేలం ద్వారా విక్రయించి తమ డబ్బును రికవరీ చేసుకుంటాయి. వరుసగా మూడు ఈఎమ్ఐలు చెల్లించకపోతే ఆయా ఆస్తులను సీజ్ చేసి వేలం ద్వారా విక్రయించేందుకు ఆర్థిక సంస్థలు చర్యలు తీసుకుంటాయి. 60 రోజుల గడువు బ్యాంకులు ఇస్తాయి. సదరు ఆస్తుల యజమానులు ఏవైనా అభ్యంతరాలుంటే సంప్రదించాలి. దీని తరువాత మరో 30రోజుల్లో ఆస్తులను వేలం నిర్వహిస్తున్నట్లుగా, ఆసక్తి ఉన్న వారు వేలంలో పాల్గొవలసిందిగా పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు.
ఆన్లైన్ లో బిడ్:
వేలంలో ఆస్తులు కొనుగోలు చేయడం కాస్త కష్టతరమైన పనిగా అనిపించినా అంత కష్టమేమీ కాదు. ఎవరైనా కొనుగోలు చేయాలంటే నేరుగా ఆన్లైన్ లో బిడ్ వేయవచ్చు. ఆన్లైన్ వేలం లేదా ఈ-వేలం ద్వారా ఆస్తుల విక్రయాలపై ఈ మధ్య కాలంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు వేలం ద్వారా ఆస్తులను విక్రయించేటపుడు కొంత తగ్గింపును ఇస్తుంటాయి.
ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ ( సెక్యూరిటైజేషన్ అండ్ రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యురీటీ ఇంట్రెస్ట్ ) చట్టం కింది కొన్ని ప్రాపర్టీ వెబ్సైట్లు ఈ రకమైన ఆస్తులను వేలం నిర్వహిస్తున్నాయి. బ్యాంకులు కూడా రుణాలు చెల్లించని వారి ఆస్తులను ఇతర థర్డ్ పార్టీ సంస్థలతో కలసి వేలం నిర్వహిస్తున్నాయి.
కొన్ని వెబ్సైట్లు:
foreclosureindia.com , bankeauctions.com లాంటివి వివిధ బ్యాంకులకు సంబంధించిన ఆస్తులను వేలం ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ సంస్థలు బ్యాంకు పేరు, వేలం తేదీ, ఆస్తి వివరాలు మొదలైన వివరాలు తెలియజేస్తున్నారు. ఆ భవనం లేదా ఫ్లాటు విక్రయం పూర్తయే వరకూ వెబ్సైటు లో లిస్టయి ఉంటుంది. ప్రతీ బ్యాంకు వెబ్సైటు కు వెళ్లి ఆస్తులను వెతుక్కోవడం లేదా ప్రకటనల కోసం వేచియుండటం కంటే ఒకే చోట అన్ని బ్యాంకులకు సంబంధించిన ఆస్తులను గురించి తెలుసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి