స్టాక్ బ్రోక‌ర్ గురించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు

ఎన్ఎస్ఈ కింద న‌మోదైన ఫిర్యాదులు 15 రోజుల్లో ప‌రిష్కారం అవుతాయి. ఒక‌వేళ కాక‌పోతే ఇన్వెస్ట‌ర్ గ్రీవెన్స్ రిసొల్యూష‌న్ ప్యానెల్‌కు రిఫ‌ర్ చేస్తారు.........

Published : 21 Dec 2020 16:15 IST

ఎన్ఎస్ఈ కింద న‌మోదైన ఫిర్యాదులు 15 రోజుల్లో ప‌రిష్కారం అవుతాయి. ఒక‌వేళ కాక‌పోతే ఇన్వెస్ట‌ర్ గ్రీవెన్స్ రిసొల్యూష‌న్ ప్యానెల్‌కు రిఫ‌ర్ చేస్తారు.

​​​​​​​స్టాక్ బ్రోక‌ర్ మీద ఫిర్యాదు చేయాల‌నుకుంటే, స్టాక్‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ను సంస్థ ప‌రిష్క‌రించ‌క‌పోతే, స్టాక్ బ్రోక‌ర్ మీఎన్ఎస్ఈకి ఆన్‌లైన్ లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. నైస్ ప్ల‌స్ఎన్ఎస్ఈ ఆన్‌లైన్ ఇన్వెస్ట‌ర్ స‌ర్వీస్ పోర్ట‌ల్ (Nseinvestorhelpline.com/NICEPLUS) ద్వారా స్టాక్ బ్రోక‌ర్ లేదా ట్రేడింగ్ మెంబ‌ర్ మీద ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

దీనికోసం మొద‌ట పాన్ నంబ‌ర్‌తో నైస్ ప్ల‌స్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. పేరు, కాంటాక్ట్ నంబ‌ర్, చిరునామా వంటి ఇత‌ర వివ‌రాల‌ను అందించాలి. కేవైసీ కోసం ఉప‌యోగించే చిరునామాకు ఫిర్యాదుకు సంబంధించిన పంపుత‌తారు కాబ‌ట్టి మీరు అందుబాటులో ఉన్న చిరునామాను ఇవ్వాలి. దీంతో పాటు అదేవిధంగా మీకు రావాల్సిన మొత్తం ఏదైనా ఉంటే ఖాతాకు పంపించేందుకు బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను అందించాలి. ఒక‌సారి అన్ని వివ‌రాలు పూరించిన త‌ర్వాత రిజిస్ట‌ర్ మొబైల్‌ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత యూజ‌ర్ నేమ్, పాస్‌వ‌ర్డ్ మీ న‌మోదిత‌ ఈమెయిల్‌కి వ‌స్తుంది.

ఫిర్యాదును ఇచ్చేందుకు నైస్ ప్ల‌స్ వెబ్‌సైట్‌లో ఈ మెయిల్ కి వ‌చ్చిన‌ యూజ‌ర్‌నేమ్ పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ కావాలి. అక్క‌డ services ట్యాబ్ మీద క్లిక్ చేసి “New Complaint" ఆ త‌ర్వాత “Complaint against TM" ని సెల‌క్ట్ చేసుకోవాలి. ఫిర్యాదు చేసేందుక ఫారంను పూరించాల్సి ఉంటుంది. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. పార్ట్ A కింద, మీరు ప్రతివాది (ఫిర్యాదు నమోదు చేస్తున్న‌ సంస్థ) మీ వివరాలను నమోదు చేయాలి. మీరు ట్రేడింగ్ ఖాతా కలిగి ఉన్న పెట్టుబడిదారుడు, లేదా సబ్ బ్రోకర్ లేదా అధీకృత వ్యక్తా అన్న‌ది పేర్కొనవలసి ఉంటుంది. మీరు పెట్టుబడిదారులైతే, బ్రోకర్ మీకు కేటాయించిన ప్రత్యేకమైన క్లయింట్ కోడ్‌ను ఇవ్వాలి. దీంతో పాటు మీరు ఇప్పటికే బ్రోకర్ దృష్టికి స‌మ‌స్య‌ను తీసుకెళ్లిన‌ట్లుగా ఉన్న వివ‌రాల‌ను అందించాలి.

ఫిర్యాదు ఫారమ్ భాగం B లో, ఇచ్చిన ఆప్ష‌న్స్‌లో ఫిర్యాదు రకాన్ని ఎంచుకోవాలి. సెక్యూరిటీలు లేదా నిధులు, కార్పొరేట్ ప్రయోజనాలు, కాంట్రాక్ట్ నోట్స్ వంటి వాటి గురించి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు; లేదా అనధికార లావాదేవీకి సంబంధించి, ఖాతాలు లేదా బ్రోకరేజ్, ఛార్జీలు వంటి పరిష్కారం కానీ స‌మ‌స్య‌ల గురించి, తప్పు బిడ్డింగ్ లేదా ఇతర ఫిర్యాదుల గురించి కావచ్చు. ఫిర్యాదు ర‌కాన్ని ఎంచుకున్న‌ తర్వాత మీరు సెక్యూరిటీ పేరు, పరిమాణం, ధర , కాంట్రాక్ట్ నోట్ తేదీ వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది.

ఇక పార్ట్ C విష‌యానికొస్తే, క్లెయిమ్ మొత్తాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత అన్ని వివ‌రాల‌ను దృవీక‌రించి ఏదైనా త‌ప్పులుంటే స‌రిచేసుకొని ఫిర్యాదును స‌మ‌ర్పించ‌వ‌చ్చు లేదా అప్ప‌టికి సేవ్ చేసుకొని తరువాత సమర్పించవచ్చు. మీరు ఫిర్యాదు లేఖ, డీమాట్ లావాదేవీ స్టేట్మెంట్, ఖాతా స్టేట్మెంట్ వంటి సంబంధిత‌ పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి.

అప్పుడు యునిక్‌ రిఫరెన్స్ నంబర్ (URN) జ‌న‌రేట్ అవుతుంది, ఫిర్యాదు ఎన్ఎస్ఈ కి చేరుతుంది. ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడానికి కూడా మీరు URN ను ఉపయోగించవచ్చు. తీర్మానం సమయంలో మిమ్మల్ని, ప్రతివాదిని అద‌న‌పు స‌మాచారం అడగవచ్చు. ఎక్స్‌ఛేంజ్‌కి, మీకు, ప్ర‌తివాదికి జ‌రిగిన మొత్తం అన్ని సంభాష‌ణ‌లు, వివ‌రాలు వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌లో క‌నిపిస్తాయి.

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా NSE లో నమోదు చేసిన ఫిర్యాదులు 15 రోజుల్లో పరిష్కార‌మ‌వుతాయి. ఒక‌వేళ‌ విఫలమైతే ఫిర్యాదును ఎక్స్ఛేంజ్ ఇన్వెస్టర్ గ్రీవెన్స్ రిజల్యూషన్ ప్యానెల్‌కు పంపిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని