పెట్టుబ‌డుదారులు స‌మ‌స్య‌ల గురించి ఫిర్యాదులు ఎలా చేయాలి?

పెట్టుబ‌డుదారులకు ఎటువంటి స‌మ‌స్య ఎదురైనా సంబంధిత‌ అధికారులు లేదా క‌న్జూమ‌ర్ కోర్టు వ‌ద్ద ప‌రిష్కారం ల‌భిస్తుంది.....

Published : 19 Dec 2020 16:22 IST

పెట్టుబ‌డుదారులకు ఎటువంటి స‌మ‌స్య ఎదురైనా సంబంధిత‌ అధికారులు లేదా క‌న్జూమ‌ర్ కోర్టు వ‌ద్ద ప‌రిష్కారం ల‌భిస్తుంది.

పెట్టుబ‌డుల విష‌యంలో ఏదైనా మోసం జ‌రిగితే ఫిర్యాదు ఎలా చేయాలి ఈ రోజుల్లో మోసపూరిత ధోర‌ణి పెరిగిపోయింది, ప్ర‌జల‌ను సుల‌భంగా మ‌భ్య‌పెట్టి త‌ప్పుడు పాల‌సీల‌ను విక్ర‌యిస్తున్నారు. మ‌రి అలా మోసాపోయామ‌ని గ్ర‌హించిన‌ప్పుడు వెంట‌నే జాగ్ర‌త్త‌ప‌డితే న‌ష్టాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి దీనికోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌లేంటి వివ‌రంగా తెలుసుకుందాం.
బీమా

  1. బీమా పాల‌సీకి సంబంధించి ఏవైనా పిర్యాదులు చేయాల‌నుకుంటే బీమా పాల‌సీ గ్రీవెన్స్ సెల్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. దీనికోసం ముందుగా ఆ బీమా కంపెనీకి సంబంధించిన‌ గ్రీవెన్స్ రీడ్ర‌స్స‌ల్ ఆఫీస‌ర్ (జీఆర్ఓ) వివరాల‌ను తెలుసుకోవాలి.
  2. ఏ విష‌యంలో స‌మ‌స్య‌ను ఎదుర్కుంటున్నారో సంబంధించిన డాక్యుమెంట్ల‌తో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుకు సంబంధించి రాత‌పూర్వ‌క అక్నాలెడ్జ్ కూడా తీసుకోవాలి.
  3. జీఆర్ఓ 15 రోజుల్లో మీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే ఐఆర్‌డీఏని సంప్ర‌దించ‌వ‌చ్చు. complaints@irda.gov.in కి మెయిల్ చేయ‌వ‌చ్చు లేదా టోల్ ఫ్రీ నంబ‌ర్ 155255 (లేదా) 1800 4254 732 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

బీమాకు సంబంధించి ఫిర్యాదులు చేయ‌గ‌లిగిన స‌మ‌స్య‌లు

  • పాల‌సీ మీకు అంద‌క‌పోతే
  • చెల్లించిన‌ ఇంకా చెల్లించాల్సిన ప్రీమియంలో వివాదం ఎదుర్కుంటే
  • క్లెయిమ్ ప‌రిష్కారం కాక‌పోతే
  • క్లెయిమ్ పాక్షికంగా లేదా పూర్తిగా తిర‌స్కారానికి గురైతే
  • కంపెనీ పాల‌సీ నియ‌మ నిబంధ‌న‌ల్లో ఏమైనా అవ‌క‌త‌వ‌క‌లుంటే ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

స్టాక్స్ లేదా ఫండ్స్

  1. స్టాక్స్ లేదా మ్యూచువ‌ల్ ఫండ్ల విష‌యంలో ఏదైనా మోసం జ‌రిగితే క‌స్ట‌మ‌ర్ కేర్ లేదా ఫండ్ సంస్థ స‌ర్వీస్ సెంట‌ర్‌ను సంప్ర‌దించాలి.
  2. వారం రోజుల్లోగా ప‌రిష్కారం కాక‌పోతే సెబీకి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. సెబీ దీనికోస‌మే సెబీ కంప్లెయింట్స్ రిడ్రెస్స్ సిస్ట‌మ్ (స్కోర్స్) ఏర్పాటు చేసింది. https://scores.gov.in లాగిన్ అయిన త‌ర్వాత ఫిర్యాదు దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ఈ వెబ్‌సైట్ నుంచి ఫిర్యాదును కూడా ట్రాక్ చేయ‌వ‌చ్చు.
  3. అప్ప‌టికీ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే క‌న్జూమ‌ర్ కోర్ట్ లో ఫిర్యాదు చేయాలి.
    ఏ విష‌యాల్లో క‌న్జూమ‌ర్‌కోర్టు వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు
  • సెక్యూరిటీలు జారీ చేయ‌డం లేదా ట్రాన్స్‌ఫ‌ర్ గురించిన స‌మ‌స్య‌ల‌కు
  • జాబితాలో ఉన్న కంపెనీల‌కు సంబంధించిన డివిడెండ్ చెల్లించ‌క‌పోతే
  • సెబీ న‌మోదిత మ‌ద్య‌వ‌ర్తిత్వ సంస్థ‌ల‌తో అసంతృప్తి ఏర్ప‌డితే
    స్థిరాస్తి
    1. స్థిరాస్తికి సంబంధించి ఏదైనా స‌మ‌స్య ఎదురైతే బిల్డ‌ర్‌కి లేదా రియ‌ల్ ఎస్టేట్ కంపెనీకి ఫిర్యాదు దాఖ‌లు చేయాలి.
  1. స‌మ‌స్యకు ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే CREDAI, NAREDCO వంటి నోడ‌ల్ ఏజెన్సీకి కంప్లెయింట్ చేయ‌వ‌చ్చు.
  2. ఇంకా స్పంద‌న క‌రువైతే ఇక చివ‌ర మిగిలింది సివిల్ , క‌న్జుమ‌ర్ కోర్టును సంప్ర‌దించ‌డ‌మే
    ఎలాంటి స‌మ‌స్య‌ల కోసం
  3. నిర్మాణంలో ఆల‌స్యం
  • ప్రాప‌ర్టీ రిజిస్ర్టేష‌న్ త‌ర్వాత కూడా స్వాధీన‌ప‌ర‌చక‌పోతే
  • త‌ప్పుడు ఒప్పందం లేదా మోసం చేసిన‌ప్పుడు
  • నిర్మాణ లేదా సేవ‌ల్లో లోపాలు
    బ్యాంకింగ్‌
  1. బ్యాంకుకు సంబంధించిన స‌మ‌స్య‌ల కోసం క‌స్ట్‌మ‌ర్ కేర్ లేదా గ్రీవెన్స్ సెల్‌ను సంప్ర‌దించాలి.
  2. స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే బ్యాంకింగ్ అంబుడ్స్మ‌న్ ఫిర్యాదు చేయాలి. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో మీ ప్రాంతానికి సంబంధించిన అంబుడ్స్‌మ‌న్ వివ‌రాలు ల‌భిస్తాయి. అన్ని బ్యాంకుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.
    3.లేఖ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అన్ని వివరాల‌ను వెల్ల‌డిస్తూ స‌మ‌స్య‌ను చేర‌వేయాలి.
    ఎలాంటి స‌మ‌స్య‌ల‌కు
  • బ్యాంకులో మీకు రావాల్సిన డ‌బ్బును ఇవ్వ‌డంలో జాప్యం చేయ‌డం లేదా మొత్తానికే ఇవ్వ‌క‌పోవ‌డం
  • డ్రాఫ్ట్ లేదా చెక్కు వంటివి జారీ చేయ‌డంలో ఆల‌స్యం చేయ‌డం
  • ప‌ని గంట‌ల్లో బ్యాంకులు ప‌నిచేయ‌క‌పోవ‌డం
  • సేవ‌ల్లో ఆలస్యం లేదా నిలిపివేత‌
  • ఖాతాను ప్రారంభించేందుకు ఎలాంటి కార‌ణం లేకుండా తిర‌స్క‌రించ‌డం
  • వినియోగ‌దారుడికి ముందుగా ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా అద‌న‌పు ఛార్జీల‌ను తీసుకోవ‌డం
  • ఎలాంటి స‌రైన కార‌ణం లేకుండా ముంద‌స్తు నోటీసు ఇవ్వ‌కుండా ఖాతాను మూసివేయ‌డం
    ఇత‌ర ఫిర్యాదులు
    1. మీరు కొనుగోలు చేసిన ఏ ఉత్ప‌త్తి గురించి అయినా కంపెనీ క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్‌ను సంప్ర‌దించాలి. అప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలో అడిగి తెలుసుకోవాలి.
  1. స‌మ‌స్య గురించి వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఫిర్యాదులో పేర్కొనాలి. ప‌రిష్కారం కోసం చేసిన అన్ని ప్ర‌య‌త్నాల‌ను వివ‌రంగా చెప్తూ లేఖ రాయ‌వ‌చ్చు లేదా మెయిల్ చేయ‌వ‌చ్చు.
  2. టోల్ ఫ్రీ నంబ‌ర్ 1800114566 లేదా నేష‌న‌ల్ క‌న్జూమ‌ర్ హెల్ప్‌లైన్ 1800114000 నంబ‌ర్‌కి ఫోన్ చేయ‌వ‌చ్చు లేదా http://consumeraffairs.nic.in/home.aspx లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.
    ఏ స‌మ‌స్య‌ల గురించి
  • తీసుకున్న ఉత్ప‌త్తిలో లోపాలు, భ‌ద్ర‌త క‌రువైతే
  • అమ్మ‌కాల్లో ఏదైనా మోసం చేస్తే
  • ఎంఆర్‌పీ కంటే ఎక్కువ డ‌బ్బును తీసుకుంటే
  • స‌ర్వీసుల్లో ఏదైనా మాల్‌ప్రాక్టీస్ లేదా లోపాలు ఉంటే వినియోగ‌దారులు ఫిర్యాదులు దాఖ‌లు చేయ‌వ‌చ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని