- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
IT Returns: ఆదాయం లేకున్నా..రిటర్నులు...
ఉద్యోగులకు ఆదాయం గురించిన ఆధారాలు సులువుగా లభిస్తాయి. వారి వేతనం స్లిప్పు, ఫారం-16లు వారికి అవసరమైనప్పుడు ఆదాయ ధ్రువీకరణలుగా ఉపయోగపడతాయి. మరి, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎలా? ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే.. అదే వారికి అధీకృత ఆదాయ ధ్రువీకరణగా మారుతుంది. వ్యక్తులకు రూ.2,50,000లోపు ఆదాయం ఉన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)కి పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం ఆసన్నమైన నేపథ్యంలో... పన్ను వర్తించే ఆదాయం లేని వారూ వీటిని సమర్పించడం వల్ల ఉన్న లాభాలేమిటో చూద్దాం...
ఆదాయ ధ్రువీకరణగా: ఉద్యోగులకు యాజమాన్యం ఫారం-16 అందిస్తుంది. అనేక సందర్భాల్లో వారికి ఇదే ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఈ ఏర్పాటు లేని వారందరూ సొంతంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునేందుకు వీలుంటుంది. తామే సొంతంగా తమ ఆదాయాన్ని తెలియజేసి, ఆ మేరకు రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఒక వ్యక్తికి ఎంత ఆదాయం ఉంది.. అతని పొదుపు, పెట్టుబడులు, ఖర్చుల గురించిన పూర్తి వివరాలను ఈ రిటర్నులు తెలియజేస్తాయి.
రిఫండ్ రావచ్చు: ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడి పథకాలపై వచ్చిన రాబడులకు పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు రిటర్నులు దాఖలు చేయడం ఒక్కటే మార్గం. మీకు పన్ను వర్తించే ఆదాయం లేనప్పుడు.. మీ నుంచి వసూలు చేసిన మొత్తం పన్నును రిఫండ్ రూపంలో రాబట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఆదాయం రూ.2,50,000 మించి ఉన్నప్పుడూ.. కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను వర్తించే ఆదాయం తగ్గిపోతుంది. ఉదాహరణకు పిల్లల ట్యూషన్ ఫీజులు, బీమా పాలసీలు ఉన్నప్పుడు వాటిని సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు.
రుణాలు తేలిగ్గా: సాధారణంగా రుణ దరఖాస్తు సమయంలో బ్యాంకులు కనీసం మూడేళ్ల ఐటీ రిటర్నులు అడుగుతుంటాయి. మీ దగ్గర ఇవి ఉంటే.. మీకు రుణం వచ్చే అవకాశాలు ఎంతో మెరుగవుతాయి. మీరు త్వరలో కారు లేదా ఇల్లు కొనాలని అనుకుంటే.. లేదా వ్యక్తిగత రుణం కోసం చూస్తుంటే.. ఐటీఆర్ మీకు ఎంతో కీలకంగా మారుతుందని మర్చిపోకండి. క్రెడిట్ కార్డులు, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునేందుకూ రిటర్నులు అవసరమే.
నష్టాల సర్దుబాటు కోసం: నిర్ణీత గడవులోపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారికి మూలధన నష్టాలను భవిష్యత్‌లో వచ్చే మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్ల లాంటివి నష్టాలకు విక్రయించినప్పుడు ఆ తర్వాత వచ్చే లాభాలతో వీటిని సర్దుబాటు చేసి, పన్ను భారం తగ్గించుకోవచ్చు.
వీసా కోసం: వీసా ఇచ్చేందుకు కొన్ని దేశాలు ఆదాయపు పన్ను రిటర్నులు కోరుతున్నాయి. మీ ఆదాయ, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాదు.. దేశంలో పన్ను నిబంధనలు పాటిస్తున్న వ్యక్తిగానూ మిమ్మల్ని గుర్తిస్తాయి.
పన్ను వర్తించే ఆదాయం లేదన్న కారణంతో రిటర్నులకు దూరంగా ఉండకండి. ఎంత ఆదాయం ఉన్నా.. నిజాయతీగా పన్ను రిటర్నులు దాఖలు చేయండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP Assembly: అసెంబ్లీలో చర్చంతా.. ఆ ముఖ్య అధికారిపైనే!
-
Ts-top-news News
Tamilisai: అరగంట ఎదురుచూశాం.. కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: గవర్నర్ తమిళిసై
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
-
World News
Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Hyderabad News: ఉద్యమంపై ప్రసంగిస్తుండగా ఆగిన ఊపిరి
- Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది