Updated : 10 Feb 2021 22:38 IST

బ్యాంక్‌కు వెళ్ల‌కుండానే ఆన్‌లైన్‌లోనే `పీఎన్‌బి` హోమ్ లోన్ ద‌ర‌ఖాస్తు

లాక్‌డౌన్ త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా మెజారిటీ సంస్థ‌లు ఇంటి నుండి ప‌ని చేసే హైబ్రిడ్ వ‌ర్క్ క‌ల్చ‌ర్ మొద‌లెట్టాయి.  ఈ ప‌రిస్థితికి అల‌వాటు ప‌డ్డ ఉద్యోగులు ఇంటి విష‌యంలో ఆధునీక‌ర‌ణ‌కు, ఇంటి విస్త‌ర‌ణ‌కు పూనుకుంటున్నారు. ప్ర‌త్యేక హోమ్ ఆఫీస్ గ‌ది కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు.  ఇంటిలో ప్ర‌త్యేక‌మైన స్థ‌లం ప‌ని ఉత్సాహాన్ని పెంచ‌డ‌మే గాక ఉత్పాద‌క‌త‌ను పెంచుతుంద‌ని న‌మ్ముతున్నారు.

గృహ రుణ రేట్లు ఆక‌ర్ష‌ణీయంగా మార‌డం మ‌రియు గ‌త 10 నెల‌ల నుండి ఇల్లు దాదాపు చాలా మందికి సుర‌క్షిత‌మైన ప‌ని ప్ర‌దేశంగా మారింది. స్థిర‌మైన రియాల్టీ మార్కెట్, కొత్త గృహ నిర్మాణ ప‌థ‌కాలు డ్రీమ్ హౌస్ కొన‌డానికి ఆత్రుత‌గా ఉన్న‌వారికి ఇదే స‌రైన స‌మ‌యంగా క‌నిపిస్తుంది.

ఇంత‌కు ముందు గృహ రుణ ధ‌ర‌ఖాస్తు ప్రక్రియ పెద్ద విష‌యంగా ఉండేది. గృహ రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం అంటే అంతులేని డాక్యుమెంటేష‌న్‌తో కూడిన ధ‌ర‌ఖాస్తు ప్రక్రియ, బ్యాంక్ ఉద్యోగుల‌తో ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు ఉండేవి. వీటికి చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతో మ‌రియు కోవిడ్‌-19 ప‌రిస్థితులు దృష్టిలో ఉంచుకుని, పిఎన్‌బి హౌసింగ్ ఆన్‌లైన్ లోన్ అప్లికేష‌న్ ప్లాట్‌ఫామ్ ను ప్ర‌వేశ‌పెట్టింది.  దీనిలో మొత్తం ప్ర‌క్రియ పూర్తిగా సాఫీగా జ‌రిగిపోతుంది. ఆన్‌లైన్ వీడియో కేవైసీ, ఓటీపి మ‌రియు ఇ-సంత‌కం ఉప‌యోగించి దృవీక‌ర‌ణ వంటివి సుర‌క్షితంగా ఉన్నాయ‌ని నిర్ధారిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండ‌టంతో మీ ఇంటి  నుండే రుణ ధ‌ర‌ఖాస్తు పూర్తి చేయ‌వ‌చ్చు.

ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు చేయ‌డం ద్వారా మీరు గిఫ్ట్ వోచ‌ర్‌ల‌ను పొందొచ్చు. రుణం ఆన్‌లైన్లో ధ‌ర‌ఖాస్తు చేసిన త‌ర్వాత రుణ ప్రాసెసింగ్ స్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవ‌చ్చు.

పిఎన్‌బి హౌసింగ్ నుండి గృహ రుణం పొంద‌డానికి మీరు చేయాల్సింద‌ల్లా ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు నింప‌డం, మీ కేవైసి, ఆదాయ ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయ‌డం, క్రెడిట్ కార్డ్ లేదా వాలెట్ (పేటిఎం) ఉప‌యోగించి ప్రారంభ ప్రాసెసింగ్ ఫీజును డిజిట‌ల్‌గా చెల్లించి, ఇ-ధ‌ర‌ఖాస్తు ఫార‌మ్‌కు ఇ-సంత‌కం చేసి స‌మ‌ర్పించాలి. సంస్థ సిబ్బందితో వ్య‌క్తిగ‌త‌ సంబంధం లేకుండా రుణం ఆమోదించ‌బ‌డుతుంది.

మీ ఇంటి నుండే ఈ ఆన్‌లైన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేయ‌వ‌చ్చు.  టెక్నాల‌జీతో స‌రియైన అనుభ‌వం లేనివారికి ఆన్‌లైన్ అప్లికేష‌న్ మొత్తం ప్ర‌క్రియ‌ను మీకు స‌హాయం చేయ‌డానికి స‌హాయ‌క బృందం అందుబాటులో కూడా ఉంటుంది. పిఎన్‌బి హౌసింగ్ మీరు కొనుగోలు చేస్తున్న ఇంటి ఖ‌ర్చులో 90% వ‌ర‌కు గృహ రుణాన్ని 30 ఏళ్ల కాల ప‌రిమితికి అందిస్తుంది.

రుణం తీసుకున్న త‌ర్వాత ముందుగా రుణ గ‌డువు తీర‌కుండానే మొత్తం తిరిగి చెల్లించినా కూడా ముంద‌స్తు చెల్లింపు ఛార్జీల్లేవు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని