Zomato: జొమాటో కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌.. యాప్‌ చెక్‌ చేయండి!

ఈ మధ్యే ఐపీవోతో దుమ్మురేపిన ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో.. మరో కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌తో రాబోతోంది. అన్‌లిమిటెడ్‌ ఫ్రీ డెలివరీ.. నో సర్జ్‌ ఫీ.. నో డిస్టెన్స్‌ ఫీ.....

Published : 02 Aug 2021 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్యే ఐపీవోతో దుమ్మురేపిన ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో.. మరో కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌తో రాబోతోంది. అన్‌లిమిటెడ్‌ ఫ్రీ డెలివరీ.. నో సర్జ్‌ ఫీ.. నో డిస్టెన్స్‌ ఫీ.. అంటూ ముందుకొస్తోంది. ఈ మెంబర్‌షిప్‌ ప్లాన్‌కు జొమాటో ప్రో ప్లస్‌ అని నామకరణం చేసింది. అయితే, పరిమిత కాలం పాటు పరిమిత సంఖ్యలోనే ఈ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నట్లు జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

ఇప్పటికే జొమాటో ప్రో పేరిట మెంబర్‌షిప్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌, డైనింగ్‌పై డిస్కౌంట్‌తో పాటు, ఉచిత డెలివరీ సేవలను దీనికింద జొమాటో అందిస్తోంది. ఈ ప్లాన్‌ కోసం 90 రోజులకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే తరహాలో ఇప్పుడు జొమాటో ప్రో ప్లస్‌ను తీసుకొస్తున్నట్లు గోయల్‌ పేర్కొన్నారు. ఈ మెంబర్‌షిప్‌ ప్లాన్‌ కింద అపరిమిత ఉచిత డెలివరీలతో పాటు, సర్జ్‌, డిస్టెన్స్‌ అంటూ ఎలాంటి ఫీజులూ వసూలు చేయబోమని తెలిపారు. అయితే, కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్‌ అయ్యేందుకు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆగస్టు 2 సాయంత్రం 6 గంటల తర్వాత జొమాటో యాప్‌ ఓపెన్‌ చేసినప్పుడు.. ఒకవేళ మీరు ఇన్వైట్‌ అయ్యి ఉంటే మీరు కొత్త ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్‌ అవ్వొచ్చు. అయితే, కొత్త ప్లాన్‌కు ఎంత మొత్తం చెల్లించాల్సిందీ గోయల్‌ వెల్లడించలేదు. ప్రస్తుతం జొమాటో ఎడిషన్‌ బ్లాక్‌ క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లు ఆటోమేటిక్‌గా జొమాటో ప్రో ప్లస్‌కు అప్‌గ్రేడ్‌ అవుతారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని