Mukesh Ambani: ముకేశ్‌ అంబానీ గ్యారేజీలోకి కొత్త కారు.. ధరెంతో తెలుసా?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ తాజాగా అత్యంత విలాసవంత రోల్స్‌రాయిస్‌ కలినన్‌ హ్యాచ్‌బ్యాక్‌ కారును    రూ.13.14 కోట్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Updated : 05 Feb 2022 08:59 IST

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ తాజాగా అత్యంత విలాసవంత రోల్స్‌రాయిస్‌ కలినన్‌ హ్యాచ్‌బ్యాక్‌ కారును రూ.13.14 కోట్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్‌టీఓ అధికారుల సమాచారం ప్రకారం.. దేశంలోనే అత్యంత ఎక్కువ ధర కార్ల కొనుగోళ్లలో ఇదీ ఒకటి. దక్షిణ ముంబయిలోని తార్డియో ప్రాంతీయ రవాణా కార్యాలయంలో జనవరి 31న ఈ కారును నమోదు చేయించారు. 2018లో ఈ కారును ఆవిష్కరించినపుడు దీని ప్రాథమిక ధర రూ.6.95 కోట్లు.  వ్యక్తిగతంగా తమకిష్టమైన మార్పులను కోరిన పక్షంలో (కస్టమైజ్డ్‌) ధర భారీగా పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. 2.5 టన్నుల బరువుండే ఈ 12 సిలిండర్‌ కారు 563 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.  ‘టస్కన్‌ సన్‌’ రంగులోని ఈ కారుకు ‘0001’ నెంబరును పొందడం కోసం రూ.12 లక్షలను కంపెనీ ఖర్చు చేసింది. 2037 జనవరి 30 వరకు రిజిస్ట్రేషన్‌ వర్తించేలా ఒకేసారి చెల్లించే(ఒన్‌ టైం) పన్ను కింద రూ.20 లక్షలు; రోడ్డు భద్రత పన్ను కింద రూ.40,000ను ఆర్‌ఐఎల్‌ చెల్లించిందని వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని