Home purchase: ఇంటి కొనుగోలు కోసం ఒకే రకమైన ఒప్పంద నమూనా

నిర్మాణదారుల చేతుల్లో ఇళ్ల కొనుగోలుదారులు మోసపోకుండా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఇళ్ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏకరూప నమూనా రూపొందించాలని పేర్కొంది.

Published : 09 Jul 2024 03:12 IST

సుప్రీంకోర్టు సూచన

దిల్లీ: నిర్మాణదారుల చేతుల్లో ఇళ్ల కొనుగోలుదారులు మోసపోకుండా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఇళ్ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏకరూప నమూనా రూపొందించాలని పేర్కొంది. ‘ఇళ్ల కొనుగోలు ఒప్పందంలో పారదర్శక, న్యాయబద్ధతను నిర్థారించేందుకు.. నిర్మాణదారులు, ఏజెంట్లు అనైతిక వ్యాపార విధానాలను అనుసరించకుండా చూసేందుకు ఒక నమూనా ఒప్పందం అవసరమంటూ’ 2021లో అశ్విని ఉపాధ్యాయ్‌ అనే న్యాయవాది  ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. నిర్మాణదారు-కొనుగోలుదారు మధ్య ముసాయిదా కొనుగోలు ఒప్పందాలను, నివేదికను ఇప్పటికే సమర్పించినట్లు ధర్మాసనానికి అమికస్‌ క్యూరీగా సహకరిస్తున్న సీనియర్‌ న్యాయవాది దేవాశిష్‌ భారుకా తెలిపారు. వీటిపై రాష్ట్రాల సూచనలు స్వీకరించి, వాటినీ పొందుపర్చినట్లు వెల్లడించారు. అమికస్‌ క్యూరీ నివేదికను, దానిపై ఉన్న అభ్యంతరాలను పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని