ITR: ఆధార్ ఓటీపీతో ఇ వెరిఫికేష‌న్ సుల‌భంగా పూర్తి

ముందుగా ఆధార్ నెంబ‌రును పాన్‌, మొబైల్ నెంబ‌ర్ల‌కు త‌ప్ప‌నిస‌రిగి అనుసంధానించాలి. 

Updated : 18 Mar 2022 14:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం.. డిజిటల్‌ సంతకం లేకుండా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఐటీఆర్‌ దాఖలు చేసినవారు 120 రోజుల్లోగా దాన్ని ఇ-వెరిఫై చేయాల్సి ఉంటుంది. లేదంటే ‘సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)’ కు ఫైల్‌ చేసిన ఐటీఆర్‌ పత్రాలను బెంగళూరులోని ఐటీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.

అయితే, ఆధార్ ఓటీపీ, బ్యాంక్ ఖాతా ఈవీసీ (ఎల‌క్ట్రానిక్ వెరిఫికేష‌న్ కోడ్‌), డీమ్యాట్ ఖాతా ఈవీసీ, ఏటీఎం ఈవీసీ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్‌సీ)ని ఉపయోగించి గానీ ఈ-వెరిఫికేషన్‌ పూర్తిచేయ‌వ‌చ్చు. ఒక‌వేళ ఈ-వెరిఫికేష‌న్ పూర్తి చేయ‌క‌పోతే ఆ రిట‌ర్నులు చెల్లుబాటుకావు. ఆధార్ ఓటీపీ ద్వారా పూర్తి చేయాల‌నుకునే వారు ముందుగా త‌మ ఆధార్ నంబర్‌ను పాన్‌, మొబైల్ నంబర్లకు త‌ప్ప‌నిస‌రిగా అనుసంధానించాలి.

ఆధార్ ఓటీపీ ద్వారా ఐటీఆర్ ఇ-వెరిఫికేష‌న్ పూర్తిచేసే విధానం..

  • ముందుగా అధికారిక ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌ పోర్ట‌ల్‌కి లాగినై ఇ-వెరిఫై రిట‌ర్న్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
  • ఆధార్ నంబర్‌కు అనుసంధాన‌మైన మొబైల్‌కి ఓటీపీ పంపించడం ద్వారా వెరిఫై చేయాల‌నుకుంటే ఆప్ష‌న్ - 1 సెల‌క్ట్ చేసుకోవాలి.
  • ఇక్క‌డ క‌నిపిస్తున్న బాక్స్‌లో టిక్ చేసి ఆధార్ వివ‌రాల ధ్రువీకరణకు మీ ఆమోదం తెలపాలి.
  • త‌ర్వాత‌ ఒక పాప్‌-అప్ విండో వ‌స్తుంది. ఇందులో జనరేట్‌ ఓటీపీ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ రిజిస్ట‌ర్ మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల ఓటీపీ వ‌స్తుంది. దీన్ని స్క్రీన్‌పై ఎంట‌ర్ చేయాలి.
  • ఓటీపీ 15 నిమిషాలు మాత్ర‌మే ప‌నిచేస్తుంది. స‌రైన ప‌ద్ధ‌తిలో ఓటీపీని న‌మోదు చేసేందుకు మూడు సార్లు మాత్ర‌మే అవకాశం ఉంటుంది.
  • ఓటీపీ స‌బ్‌మిట్‌ చేసిన త‌ర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడీ వ‌స్తుంది. దీన్ని సేవ్ చేసుకోవాలి.
  • ఇ-వెరిఫికేష‌న్‌ను ధ్రువీకరిస్తూ మీ రిజిస్టర్డ్ ఫోన్ లేదా ఇ-మెయిల్‌కు మెసేజ్ పంపిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని