ప‌న్ను చెల్లింపుల‌ను సుల‌భ‌తంగా చేసేంద‌కే ఈ నిర్ణ‌యం..నిర్మ‌లా సీతారామ‌న్

75 ఏళ్ళు పైబ‌డిన సీనియ‌ర్ సిట‌జ‌న్ల‌కు, చెల్లింపులను జ‌రిపే బ్యాంకు వారి ఆదాయంపై ప‌న్ను త‌గ్గించి మిగిలిన మొత్తాన్ని ఖాతాకు బ‌దిలీ చేస్తుంది 

Published : 03 Feb 2021 11:11 IST

పెన్ష‌న్‌, వ‌డ్డీ మాత్ర‌మే ఆదాయ వ‌న‌రుగా ఉన్న‌ 75 ఏళ్లు పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ను ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయ‌డం నుంచి మిన‌హాయింపు క‌ల్పిస్తున్న‌ట్లు యూనియ‌న్ బడ్జెట్ 2021లో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతా రామ‌న్ ప్ర‌క‌టించారు. 

బ‌డ్జెట్ ప్ర‌సంగంలో నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ "మన దేశం స్వాతంత్ర్యం పొందిన 75 వ సంవత్సరంలో, 75 సంవత్సరాలు,  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లపై ప్రభుత్వం సమ్మతి భారాన్ని తగ్గిస్తుంది"‌. పెన్ష‌న్‌, వ‌డ్డీ ఆదాయం మాత్ర‌మే ఉన్న సీనియ‌ర్ సిటిజ‌న్లు, వారి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయ‌కుండా మిన‌హాయింపు క‌ల్పిస్తూ ప్ర‌తిపాద‌న చేస్తున్నాను. అటువంటి వారి ఆదాయంపై అవ‌స‌ర‌మైన ప‌న్ను, వారికి చెల్లింపుల‌ బ్యాంక్, ఆదాయంపై ప‌న్ను త‌గ్గించి మిగిలిన డ‌బ్బును ఖాతాకు బ‌దిలీ చేస్తుంది.

ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది ఏంటంటే 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు పన్ను చెల్లింపుల‌పై మినహాయింపు ఇవ్వ‌లేదు.   పైన తెలిపిన ష‌ర‌తుల‌కు అర్హ‌లైన వారికి ఆదాయపు పన్ను రిటర్న‌లు (ఐటిఆర్) దాఖలు చేయడం నుంచి మాత్రమే మిన‌హాయింపు ల‌భించింది. 

పెన్ష‌న్, వ‌డ్డీ ఆదాయం వ‌చ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒకే బ్యాంకులో ఉన్న సంద‌ర్భంలో మాత్ర‌మే ఆదాయ‌పు ప‌న్ను రిటర్నులు దాఖ‌లు చేయ‌డం నుంచి మిన‌హాయింపు ల‌భిస్తుంద‌ని క్లియ‌ర్ టాక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈఓ అర్చిత్ గుప్తా తెలిపారు. 

కింది షరతులకు లోబ‌డి ఉన్న‌ 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయ ప‌న్ను రిట‌ర్నుదాఖలు చేయకుండా సడలింపు ఇవ్వడానికి  కొత్త సెక్ష‌న్‌ను చేర్చాలని 2021  యూనియ‌న్ బ‌డ్జెట్లో  ప్రతిపాదించారు

1. సీనియర్ సిటిజన్ భారతదేశంలో నివసిస్తుండాలి. ముందు సంవ‌త్స‌రాన‌కి 75 ఏళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు గ‌ల‌వారై ఉండాలి. 

2. పెన్ష‌న్‌, వ‌డ్డీ ఆదాయం త‌ప్ప మ‌రే ఇత‌ర ఆదాయాలు ఉండ‌కూడ‌దు. పెన్షెన్ పొందుతున్న అదే బ్యాంకులో వ‌డ్డీ ఆదాయం పొందాల్సి ఉంటుంది.

3. దీనికి నిర్ధ‌ష్ట బ్యాంకులు ఉంటాయి. బ్యాంకింగ్ సంస్థ సూచించిన కొన్ని బ్యాంకుల‌ను నిర్ధేశించిన బ్యాంకులుగా కేంద్ర ప్ర‌భుత్వం తెలియ‌జేస్తుంది. 

4. సీనియ‌ర్ సిటిజ‌న్లు పేర్కొన్న వివ‌రాలు స‌రైన‌వ‌ని తెలియ‌జేస్తూ బ్యాంకుకు డిక్లరేషన్ ఇవ్వాలి. కావ‌ల‌సిన వివ‌రాలు, ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో ఇచ్చేందుకు బ్యాంకు ఫార‌మ్‌ను ఇస్తుంది. ఆ ఫార‌మ్ రూపంలోనే వివ‌రాలు ధృవీక‌రించాల్సి ఉంటుంది.
 
"సీనియ‌ర్ సిటిజ‌న్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, నిర్ధేశించిన‌ బ్యాంక్, అత‌ను/ ఆమె ఆదాయాన్ని లెక్కించి, VI-A అధ్యాయం కింద అనుమతించిన‌ తగ్గింపు,  సెక్షన్ 87 ఎ కింద వ‌ర్తించే రాయితీని అమలు చేసిన త‌రవాత, బ‌డ్జెట్ ప‌త్రాల‌ను అనుస‌రించి, అమలులో ఉన్న రేట్ల ప్ర‌కారం సంబంధిత అంచనా సంవత్సరానికి ఆదాయ‌పు ప‌న్ను డిడ‌క్ట్ చేస్తారు.  ఇది పూర్తైన‌ తర్వాత,  అసెస్మంట్ సంవ‌త్స‌రానికి రిఫండ్ కోసం ఎదురు చూడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. 

సాధార‌ణంగా, 75 సంవ‌త్స‌రాలు, అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారికి పెన్ష‌న్ ఆదాయం  ఉంటుంది. అదేవిధంగా వారి వ‌ద్ద ఉన్న మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే వ‌డ్డీ ఆదాయాన్ని పొందుతుంటారు. ఇలాంటి వారికి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఇది సుల‌భ‌త‌రం చేసేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. ఈ విధానంలో బ్యాంకులు ఆదాయ‌పు ప‌న్ను డిడ‌క్ట్ చేసి ప్ర‌భుత్వానికి జ‌మ చేస్తాయి. కాబ‌ట్టి సీనియ‌ర్ సిటిజ‌న్లు రిట‌ర్నులు ఫైల్ చేయాల్సి అవ‌స‌రం ఉండ‌దు అని పాండే తెలిపారు. 

సీనియ‌ర్ సిటిజన్లు,  డిపాజిట్లు ఉన్న ఇత‌ర బ్యాంకులకు ఫారం 15హెచ్ ఇవ్వ‌డం ద్వారా టీడీఎస్ డిడ‌క్ట్ అవ్వ‌దు. ఇత‌ర బ్యాంకులు టీడీఎస్‌ను వ‌సూలు చేస్తే, రిఫండ్ క్లెయిమ్ చేసేందుకు రిట‌ర్నుల‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని