Brand value: బ్రాండ్‌ విలువలో కోహ్లీని దాటేసిన రణ్‌వీర్‌.. టాప్‌-25లో అల్లు అర్జున్‌కు చోటు!

most valuable celebrities: బ్రాండ్‌ విలువ పరంగా బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. టాప్‌-25తో కూడిన జాబితాలో అల్లు అర్జున్‌ సైతం చోటు దక్కించుకున్నాడు.

Published : 21 Mar 2023 19:28 IST

Brand value| ముంబయి: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) అత్యంత బ్రాండ్‌ విలువ (Brand value) కలిగిన సెలబ్రిటీగా అవతరించాడు. గతేడాది అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీని (Virat Kohli) వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచాడు. 2022  సంవత్సరానికి గానూ ‘సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యేయేషన్‌ స్టడీ’ పేరిట కన్సల్టింగ్‌ సంస్థ క్రోల్‌ వెలువరించిన జాబితాలో 185.1 మిలియన్‌ డాలర్లతో రణ్‌వీర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. తెలుగు నుంచి అల్లు అర్జున్‌ (Allu Arjun) సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.

బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌, ప్రపంచ వ్యాప్తంగా ఉనికి ఆధారంగా బ్రాండ్‌ విలువను లెక్కించి ఏటా క్రెల్‌ ఈ తరహా జాబితాను వెలువరిస్తుంటుంది. 20022 ఏడాది గానూ 25 మందితో తాజాగా ఈ జాబితాను వెలువరించింది. టాప్‌-25 సెలబ్రిటీల మొత్తం బ్రాండ్‌ విలువ గతేడాదితో పోలిస్తే 29.1 శాతం పెరిగి 1.6 బిలియన్లకు చేరిందని క్రెల్‌ పేర్కొంది. ఇక జాబితా విషయానికొస్తే.. 2020లో 237.3 మిలియన్‌ డాలర్లుగా ఉన్న కోహ్లీ బ్రాండ్‌ విలువ 2021లో 185.7 మిలియన్ల డాలర్లకు పడిపోయింది. తాజాగా ఆ మొత్తం 176.9 మిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో ఈ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

బాలీవుడ్‌కు చెందిన అక్షయ్‌ కుమార్ 158.3 మిలియన్‌ డాలర్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. 2021లో 181.7 మిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచాడు. టాలీవుడ్‌ నటుడు అల్లు అర్జున్‌ 31.4 మిలియన్‌ డాలర్లతో 20వ స్థానంలోనూ, రష్మిక మందన్న 25.3 మిలియన్‌ డాలర్లతో 25వ స్థానంలో నిలిచారు.
Also Read:  బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. టీజర్‌తో సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తోన్న ‘పుష్ప2’టీం 

  • ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన నీరజ్‌ చోప్రా టాప్‌-25లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. 26.5 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువతో పీవీ సింధుతో సమానంగా 23వ స్థానంలో నిలిచాడు. 
  • 2021లో 68.1 మిలియన్‌ డాలర్లుగా ఉన్న అలియా భట్‌ బ్రాండ్‌ విలువ 2022లో ఏకంగా 102.9  మిలియన్‌ డాలర్లకు చేరింది. ఓవరాల్‌ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. దీపిక (82.9మి.డా) ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
  • మాజీ క్రికెటర్లు అయిన ధోనీ 80.3 మిలియన్‌ డాలర్లతో ఆరో స్థానంలో నిలవగా.. 73.6 మిలియన్‌ డాలర్ల విలువతో సచిన్‌ తెందూల్కర్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 55.7 మిలియన్ డాలర్లతో షారుక్‌ పదో స్థానంలో, 54.5 మిలియన్‌ డాలర్లతో సల్మాన్‌  11వ స్థానంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని