Adani Group: రాజస్థాన్‌లో అదానీ గ్రూప్‌ రూ.65,000 కోట్ల పెట్టుబడులు

రాజస్థాన్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గౌతమ్‌ అదానీ ప్రకటించారు. వచ్చే 5-7 ఏళ్లలో వివిధ రంగాల్లోకి వీటిని మళ్లించనున్నట్లు తెలిపారు.

Published : 07 Oct 2022 20:48 IST

జైపుర్‌: రానున్న 5-7 ఏళ్లలో రాజస్థాన్‌లో రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ ప్రకటించారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు తయారీ కేంద్రం, సిమెంటు ప్లాంటు విస్తరణ, జైపుర్‌ విమానాశ్రయ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ సరఫరాకు కావాల్సిన మౌలిక వసతులు; పరిశ్రమలు, ఇళ్లకు గ్యాస్‌ పైప్‌లైన్‌; పునరుత్పాదక ఇంధన సరఫరాకు కావాల్సిన సరఫరా లైన్ల ఏర్పాటు వంటి ప్రాజెక్టుల్లోనూ  పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ‘ఇన్వెస్ట్‌ రాజస్థాన్‌ 2022’ పేరిట శుక్రవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

అదానీ గ్రూప్‌ హరిత ఉదజని తయారీపై ప్రధానంగా దృష్టి సారించిందని గౌతమ్‌ అదానీ తెలిపారు. అతితక్కువ ఖర్చుతో సౌర, పవన విద్యుత్తును అందించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా రాజస్థాన్‌ ఎడారి ఉపాధి కల్పన కేంద్రంగా మారనున్నట్లు తెలిపారు. ఈ సామర్థ్యం మరే రాష్ట్రానికీ లేదన్నారు. ఇప్పటికే తమ గ్రూప్‌ కంపెనీలు రాజస్థాన్‌లో రూ.35,000 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని