Adani group: సిమెంట్‌ వ్యాపారంలో అదానీ దూకుడు.. అంబుజా చేతికి పెన్నా సిమెంట్‌

Adani group: సిమెంట్‌ వ్యాపారంలో విస్తరణ దిశగా అదానీ గ్రూప్‌ అడుగులు వేస్తోంది. పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.

Published : 13 Jun 2024 20:50 IST

Adani group | దిల్లీ: అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌లో వాటాల కొనుగోలు ద్వారా సిమెంట్‌ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్‌.. తన దూకుడును పెంచింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్‌ కంపెనీ అయిన అంబుజా సిమెంట్‌ ద్వారా రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసేందుకు బైండింగ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది.

పెన్నా సిమెంట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా అదానీ గ్రూప్‌ సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 14 మిలియన్‌ టన్నుల మేర పెరగనుంది. తద్వారా గ్రూప్‌ మొత్తం సామర్థ్యం 89 మిలియన్‌ టన్నులకు పెరగనుంది. పెన్నా ప్రతాపరెడ్డి, వారి కుటుంబసభ్యుల నుంచి నూరు శాతం షేర్లను అంబుజా కొనుగోలు చేయనుంది. పెన్నాకు ఏపీ, తెలంగాణ, రాజస్థాన్‌ (నిర్మాణంలో ఉన్న) సిమెంట్‌ ప్లాంట్లు ఉన్నాయి. ఈ కొనుగోలు వల్ల దేశంలో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ వాటా 2 శాతం పెరగనుండగా.. దక్షిణ భారతంలో 8 శాతం మేర వృద్ధి చెందనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని