Adani group: హిండెన్‌బర్గ్ ‘షార్ట్’ షూటింగ్.. కొనసాగిన అదానీ షేర్ల పతనం
హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లలో అధికభాగం సోమవారం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన ఎనర్జీ షేర్లు కుప్పకూలాయి.
ముంబయి: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక ప్రభావంతో గతవారం భారీ నష్టాలను చవిచూసిన అదానీ గ్రూప్ (Adani group) షేర్లు.. సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ప్రధానమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాలను దక్కించుకున్నప్పటికీ.. అధిక భాగం కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన ఎనర్జీ షేరు ధరలు భారీగా పతనమయ్యాయి.
• ఎన్‌ఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) షేరు ధర 3.93శాతం లాభంతో రూ.2,869.85 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో ఈ షేరు ధర ఒక దశలో 10 శాతం వరకు పెరిగింది.
• ట్రేడింగ్ ఆరంభమైన కాసేపటికే అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) షేరు ధర 20శాతం పతనమై లోయర్ సర్క్యూట్‌ను తాకింది. నేటి ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు విలువ రూ.585.60 తగ్గి రూ.2,342.40 వద్ద ముగిసింది.
• అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) షేరు ధర కూడా ఒక దశలో 20 శాతం కుంగింది. ఆ తర్వాత కాస్త కోలుకుని మార్కెట్ ముగిసే సమయానికి 15.23శాతం నష్టంతో రూ.1707.35 వద్ద స్థిరపడింది.
• అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) షేరు విలువ 20శాతం పతనమైంది. నేటి ట్రేడింగ్‌లో ఈ షేరు ధర రూ.297.25శాతం తగ్గి రూ.1,189.00 వద్ద ముగిసింది.
• అదానీ పవర్ (Adani Power) లిమిటెడ్ షేరు ధర 5 శాతం కుంగి రూ.235.55గా ముగిసింది.
• అదానీ విల్మర్ (Adani Wilmar) షేరు ధర కూడా 5 శాతం తగ్గి రూ.491 వద్ద స్థిరపడింది.
• అదానీ పోర్ట్స్ (Adani Ports) షేరు ధర 0.64శాతం స్వల్ప లాభంతో రూ.600.80 వద్ద ముగిసింది. ఈ షేరు కూడా నేడు ఒక దశలో 10 శాతానికి పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది.
• ఇక, అంబుజా సిమెంట్స్, ఏసీసీ షేర్లు కూడా ఒకశాతానికి పైగా లాభపడ్డాయి.
అదానీ గ్రూప్ (Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg research) విడుదల చేసిన సంచలన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో స్టాక్‌మార్కెట్లలో ఈ షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka: మే 10నే ఎన్నికలు.. కాంగ్రెస్‌లో చేరికలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
-
Sports News
Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారేమో!