Green Hydrogen: గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిలో ‘అదానీ’కి జతగా టోటల్‌ఎనర్జీస్‌

హరిత ఉదజని (Green Hydrogen) ఉత్పత్తి నిమిత్తం ఏర్పాటు చేయనున్న కంపెనీలో ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌ (TotalEnergies)ను కూడా తమతో కలుపుకోవాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది.....

Published : 14 Jun 2022 17:56 IST

దిల్లీ: హరిత ఉదజని (Green Hydrogen) ఉత్పత్తి నిమిత్తం ఏర్పాటు చేయనున్న కంపెనీలో ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌ (TotalEnergies)ను కూడా తమతో కలుపుకోవాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాటైన ‘అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ (ANIL)లో 25 శాతం వాటాను ఆ కంపెనీకి విక్రయించింది. ఈ లావాదేవీ విలువను మాత్రం బహిర్గతం చేయలేదు. హరిత ఉదజని (Green Hydrogen) రంగంలో వచ్చే పదేళ్లలో 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (AEL) గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

హరిత ఉదజని ఉత్పత్తి, వాణిజ్యీకరణకు ఏఎన్‌ఐఎల్‌ ఇరు సంస్థలకు సంయుక్త వేదికగా నిలవనుంది. 2030 నాటికి ఏడాదికి 1 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫలితంగా భారత్‌కు 30 గిగావాట్ల అదనపు స్వచ్ఛ ఇంధన సామర్థ్యం ఏర్పడుతుంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను చేపట్టడం; కర్బనరహిత విద్యుదుత్పత్తి; విండ్‌ టర్బైన్‌, సోలార్‌ మాడ్యూల్స్‌, బ్యాటరీల తయారీయే లక్ష్యంగా అదానీ గ్రూప్‌ గత జనవరిలో ఏఎన్‌ఐఎల్‌ను ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని