Adani Group: ఎఫ్‌పీఓపై వెనక్కి తగ్గిన అదానీ.. పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడి!

మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఎఫ్‌పీఓ సబ్‌స్క్రిప్షన్‌తో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు అదానీ గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

Updated : 02 Feb 2023 06:30 IST

ముంబయి: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) ద్వారా సేకరించిన నిధులను ఖర్చు చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు కంపెనీ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎఫ్‌పీఓ ద్వారా సేకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంతోపాటు, లావాదేవీలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు అదానీ గ్రూప్‌ (Adani Group) ఒక ప్రకటనలో తెలిపింది. 

‘‘ఎఫ్‌పీవో సందర్భంగా సంస్థపై నమ్మకం ఉంచి, అండగా నిలిచిన  ప్రతి పెట్టుబడిదారుడి కృతజ్ఞతలు. మంగళవారం ఎఫ్‌పీఓ సబ్‌స్క్రిప్షన్‌ విజయవంతమైంది. అయితే, గత వారం రోజులుగా షేర్లలో అస్థిరత నెలకొన్నప్పటికీ సంస్థ వ్యాపార నిర్వహణపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌పీఓతో ముందు సాగకూడదని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు నిర్ణయించింది’’ అని ప్రకటించింది. 

ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు బలమైన బ్యాలెన్స్‌ షీట్‌, సురక్షితమై ఆస్తులు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో సంస్థకు అద్భుతమైన ట్రాక్‌ రికార్డ్ ఉందని పేర్కొంది. ఎఫ్‌పీఓతో ముందుకు వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయం సంస్థపై, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని