పెట్రోల్, డీజిల్ ఒక రూపాయి తక్కువకే: నయారా ఎనర్జీ
petrol, diesel price: పెట్రోల్, డీజిల్‌ను ఒక రూపాయి తక్కువకే విక్రయిస్తామని ప్రైవేటు రంగ చమురు సంస్థ నయారా ప్రకటించింది.
దిల్లీ: ప్రైవేటు రంగానికి చెందిన చమురు సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్, డీజిల్ ధరలను (petrol, diesel prices) తగ్గించింది. ప్రభుత్వరంగ చమురు సంస్థల ధర కంటే రూ.1 తక్కువకే విక్రయించడం ప్రారంభించినట్లు తెలిపింది. ఇటీవల రిలయన్స్-బీపీ సుపీరియర్ గ్రేడ్ క్వాలిటీ డీజిల్‌ను రూ.1 తక్కువకే విక్రయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో నయారా నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కంపెనీలు గత కొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ రేట్లను స్థిరంగా ఉంచుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా ఆయా సంస్థలు రేట్లను సవరించలేదు. ప్రస్తుతం రేట్లు దిగివచ్చినప్పటికీ.. అప్పటి నష్టాలను భర్తీ చేసుకుంటున్నాయి.
మరోవైపు ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు స్థిరంగా ఉంచడంతో ప్రైవేటు రంగ కంపెనీలు నష్టాలు భరించలేక అధిక ధరకు చమురును ఇన్నాళ్లు విక్రయించాయి. దీంతో మార్కెట్ వాటాను కోల్పోయాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు శాంతించడంతో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయడంతో పాటు తమ మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా సుపీరియర్ క్వాలిటీ డీజిల్‌ను మాత్రమే రూ.1 తక్కువకు విక్రయిస్తామని రిలయన్స్-బీపీ ప్రకటించగా.. పెట్రోల్, డీజిల్ రెండింటినీ రూ.1 తగ్గించి విక్రయిస్తామని నయారా ప్రకటించింది. దేశంలో మొత్తం 86,925 పెట్రోల్ పంపులు ఉండగా.. అందులో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలవే 78,567 ఉన్నాయి. నయరా ఎనర్జీకి 7 శాతం వాటా ఉంది. దేశవ్యాప్తంగా 6,376 పెట్రోల్ పంపులు ఉన్నాయి. రిలయన్స్ బీపీకి 1,555 పెట్రోల్ బంకులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబరు 3న రాష్ట్రానికి సీఈసీ
-
Drones: డ్రోన్లతో భారత్‌లోకి మాదక ద్రవ్యాలు.. అడ్డుకున్న బీఎస్ఎఫ్
-
INDIA bloc: ఎన్నికల సమయంలో.. ఇండియా కూటమిలో విభేదాలను తోసిపుచ్చలేం: శరద్ పవార్
-
Tovino Thomas: ‘ది కేరళ స్టోరీ’ స్థానంలో ‘2018’కి ఆస్కార్ ఎంట్రీ?’.. టొవినో రియాక్షన్ ఏంటంటే?
-
Tirumala: ఘాట్‌రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు సడలించిన తితిదే
-
Pakistan: పాక్‌లో మరోసారి పేలుళ్లు.. పలువురి మృతి