Artificial Intelligence: కృత్రిమ మేధతో మరిన్ని ఉద్యోగాలు.. డెలాయిట్‌ ఏఐ ఎగ్జిక్యూటివ్‌ అంచనా

Artificial Intelligence: కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే వాదనను డెలాయిట్‌ ఏఐ ఎగ్జిక్యూటివ్‌ రోహిత్‌ టాండన్‌ కొట్టిపారేశారు. మరిన్ని కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా వేశారు.

Published : 23 Jun 2024 19:50 IST

దిల్లీ: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) తక్కువ నైపుణ్యాలున్న మనుషులను నాణ్యమైన స్కిల్స్‌ ఉన్నవారితో రీప్లేస్‌ చేస్తుందని డెలాయిట్‌ ఏఐ ఎగ్జిక్యూటివ్‌ రోహిత్‌ టాండన్‌ తెలిపారు. ఈ అధునాతన సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయని వినిపిస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. భవిష్యత్తు ఏఐ - మానవుల భాగస్వామ్యానిదేనని వెల్లడించారు. కానీ, పూర్తిగా మనుషులను తీసివేసే రోజులు మాత్రం రావని స్పష్టం చేశారు. సాంకేతికత మానవాళిని మరింత శక్తిమంతుల్ని చేస్తుందే తప్ప.. వారిని రీప్లేస్‌ చేయలేదని వ్యాఖ్యానించారు.

కేవలం సులభంగా చేయగలిగే పనులను మాత్రమే ఏఐ భర్తీ చేస్తుందని రోహిత్‌ తెలిపారు. పైగా మరిన్ని నూతన రంగాలు, తద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంచనా వేశారు. ఐటీ, కంప్యూటర్లు ఆరంభ దశలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయనే అపోహలు చక్కర్లు కొట్టినట్లు గుర్తుచేశారు. కానీ, వీటి వల్ల ఎన్ని కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగిందో మన కళ్ల ముందుందని వ్యాఖ్యానించారు. సులభంగా చేయగలిగే కొన్ని ఉద్యోగాలు మాత్రమే ఆటోమేట్‌ అయ్యాయని గుర్తుచేశారు. తద్వారా మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే అవకాశం మనుషులకు లభించిందన్నారు.

అన్ని కంపెనీలు, పరిశ్రమల్లో కామన్‌గా ఉండే ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ వంటి విభాగాలు ఏఐ వల్ల తొలుత ప్రభావితమవుతాయని రోహిత్‌ తెలిపారు. కంప్యూటర్‌ విజన్‌, ఏఐ, వేగంగా గణించగలిగే సామర్థ్యంతో కార్చిచ్చుల నివారణ సాధ్యమవుతోందంటూ ఏఐ కృత్రిమ మేధ ఉపయోగాలను వివరించారు. అదే తరహాలో బ్యాంకింగ్‌, ఆతిథ్యం, మార్కెటింగ్‌ వంటి రంగాల్లోనూ ఏఐ వినియోగం ఊపందుకుంటోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు