Air India: నెరిస్తే రంగు.. బట్టతలైతే పూర్తి గుండు: సిబ్బందికి ఎయిరిండియా కొత్త రూల్స్!
సిబ్బంది వస్త్రధారణకు ఎయిరిండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటిని సిబ్బంది కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టాటా యాజమాన్యంలో ఎయిరిండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. ముఖ్యంగా విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూ, సిబ్బంది అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండేలా వారి ఆహార్యంలో మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళా సిబ్బంది వస్త్రధారణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. జుట్టు నెరిసిన వారు రంగు వేసుకోవాలని, అమ్మాయిలైతే మేకప్ కచ్చితంగా వేసుకోవాలని సూచించింది. ఈ మేరకు హెయిర్‌స్టైల్, ఆభరణాలు, యూనిఫామ్‌కు సంబంధించి 40 పేజీల సర్క్యులర్ జారీ చేసింది. సిబ్బంది ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
పురుష సిబ్బందికి నిబంధనలు ఇలా..
* బట్టతల లేదా జుట్టు ఎక్కువగా ఊడిపోయి నుదురు ఎక్కువగా కన్పించేవారు పూర్తిగా గుండు చేయించుకోవాలి. దాన్ని కూడా ప్రతి రోజూ షేవ్ చేసుకుంటూ ఉండాలి.
* నెరిసిన జట్టును అనుమతించబోం. తెల్లవెంట్రకలు ఉన్నవారు క్రమం తప్పకుండా సహజ షేడ్‌లో జుట్టుకు రంగు వేసుకోవాలి. ఫ్యాషన్ రంగులు, హెన్నా వంటివి వేసుకోకూడదు.
* జుట్టును ఎప్పుడూ చిన్నగా కటింగ్ చేయించుకుని హెయిర్ జెల్ తప్పనిసరిగా రాసుకోవాలి. పక్క పాపిటితో నున్నగా దువ్వుకోవాలి.
* చేతికి ఒకే ఒక్క ఉంగరం.. అది కూడా పెళ్లికి సంబంధించినది అయితేనే అనుమతిస్తాం. బ్రాస్‌లైట్‌లు వేసుకోకూడదు.
* సిక్కు ఉద్యోగులు చేతికి కడియం ధరించొచ్చు. అయితే అది బంగారం లేదా వెండితో ఎలాంటి డిజైన్లు, లోగోలు, రంగు రాళ్లు లేకుండా 0.5సెంటీమీటర్ల మందంతో మాత్రమే ఉండాలి.
* విమానంలో ఉన్నంత సేపు అన్ని క్యాబిన్ల సిబ్బంది నల్లరంగు జాకెట్లు ధరించాల్సిందే. ఎలాంటి లోగోలు లేని నలుపు సాక్సులు మాత్రమే వేసుకోవాలి.
మహిళా సిబ్బంది పాటించాల్సిన నిబంధనలివే..
* చీరలు లేదా ఇండో వెస్టర్న్ యూనిఫామ్.. ఏది ధరించినా స్కిన్ కలర్‌లో ఉండే సాక్సులు ధరించాలి. చలికాలంలో కంపెనీ ఇచ్చిన స్వెటర్లు మాత్రమే ధరించాలి.
* శరీర ఛాయకు సరిపోయే ఫౌండేషన్, కన్సీలర్లు తప్పనిసరిగా వేసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీ షేడ్ కార్డ్ ఇచ్చే మేకప్ వేసుకోవాల్సిందే. ఐషాడో, లిప్‌స్టిక్, గోళ్ల రంగు, హేయిర్ షేడ్ కార్డ్స్ యూనిఫామ్ ప్రకారం అనుసరించాలి. నచ్చిన షేడ్స్ వేసుకోడానికి వీల్లేదు.
* చెవులకు బంగారం, లేదా వజ్రాలతో ఉండే గుండ్రటి పోగులు (స్టడ్స్) మాత్రమే ధరించాలి. వాటిపై ఎలాంటి డిజైన్ ఉండకూడదు. ముత్యాల పోగులు ధరించడానికి అనుమతి లేదు.
* చీర కట్టుకునేవాళ్లు మాత్రమే నుదుటిన చిన్న బొట్టు పెట్టుకోవాలి. అది కూడా ఐచ్ఛికమే.
* రెండు ఉంగరాలు పెట్టుకోవచ్చు. కానీ ఒక్కో చేతికి ఒక్కోటి మాత్రమే ధరించాలి. చేతికి ఒకే ఒక్క సన్నని గాజు వేసుకోవాలి.
* అమ్మాయిలు కూడా జుట్టు నెరిసిపోతే సహజ షేడ్స్ లేదా కంపెనీ హెయిర్ కలర్ షేడ్ కార్డ్‌లో ఉండే రంగు వేసుకోవాలి.
* కంపెనీ మార్గదర్శకాల ప్రకారమే జడ వేసుకోవాలి. మరీ పైకి గానీ.. మరీ కిందకు గానీ కొప్పులు వేసుకోకూడదు. హెయిర్ బన్‌ను తల వెనుకవైపు మధ్యలో వేసుకోవాలి. దానిపై సన్నని నెట్ వేసుకోవాలి. జుట్టుకు కేవలం నాలుగే టిక్‌టాక్ పిన్స్ పెట్టుకోవాలి. చిన్న జుట్టు ఉన్న వారు పర్మనెంట్ స్ట్రెట్‌నింగ్ చేయించుకుని నీట్‌గా దువ్వుకోవాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
suez canal: సూయిజ్ కాలువలో ఆగిపోయిన చమురు ట్యాంకర్
-
World News
china: తియానన్మెన్ స్క్వేర్ వద్దకు ప్రవేశాలపై ఆంక్షలు
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Crime News
Suicide: నలుగురు పిల్లల్ని చంపేసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
Siddharth: ‘టక్కర్’తో నా కల నెరవేరింది.. ఆయనకు రుణపడి ఉంటా: సిద్ధార్థ్