Air India: కొన్ని అమెరికన్‌ నగరాలకు విమాన సర్వీసుల కుదింపు: ఎయిరిండియా

Air India: సిబ్బంది కొరత వల్ల కొన్ని అమెరికన్‌ నగరాలకు నడిపే విమానాల సర్వీసుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు  ఎయిరిండియా తెలిపింది.

Published : 20 Mar 2023 15:26 IST

దిల్లీ: అమెరికాలోని కొన్ని నగరాలకు విమాన సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా కుదిస్తున్నట్లు ఎయిరిండియా (Air India) ప్రకటించింది. సిబ్బంది కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని సంస్థ సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌ సోమవారం తెలిపారు.

బోయింగ్‌ 777 విమానాలకు 100 మంది పైలట్లు వచ్చే మూడు నెలల్లో చేరనున్నట్లు క్యాంబెల్‌ తెలిపారు. మరో 1,400 మంది క్యాబిన్‌ సిబ్బంది ప్రస్తుతం శిక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. సిబ్బంది కొరత వల్ల సుదూర లక్ష్యాలకు నడిచే పలు విమానాలను ఇటీవల ఎయిరిండియా (Air India) రీషెడ్యూల్‌ చేసింది. ఇలాంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియాలో 11,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను టాటా గ్రూప్‌ జనవరి 2022లో కొనుగోలు చేసింది. ఎయిరిండియా (Air India) ఎక్స్‌ప్రెస్‌ సహా ఏఐఏటీఎస్‌ఎల్‌లోనూ 50 శాతం వాటాలను చేజిక్కించుకుంది. విహాన్‌.ఏఐ పేరిట సంస్థలో మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా విమానాల ఇంటీరియర్స్‌ను మరింత మెరుగుపర్చడం కోసం 400 మిలియన్ డాలర్లు కేటాయించింది. అలాగే 470 కొత్త విమానాల కోసం భారీ ఆర్డర్‌ పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు