Airtel 5G: తెలంగాణలో మరో రెండు నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తెలంగాణలో మరో రెండు నగరాల్లో 5జీ సేవలను తీసుకొచ్చింది. కరీంనగర్‌, వరంగల్‌లోని ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

Published : 31 Jan 2023 22:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) తన 5జీ ప్లస్‌ (Airtel 5G Plus) సేవలను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా తెలంగాణలో మరో రెండు నగరాల్లో ఈ సేవలు ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌ వాసులకు ఎయిర్‌టెల్ 5జీప్లస్‌ సేవలను అందిస్తుండగా.. వరంగల్ (Warangal), కరీంనగర్‌(Karimnagar)లోనూ ఈ సేవలను తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. దీంతో తెలంగాణలో 3 నగరాల్లో 5జీ ప్లస్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది.

వరంగల్‌లో హనుమకొండ, అశోకా హోటల్, కాజీపేట రైల్వే స్టేషన్‌, రెడ్డీ కాలనీ, కాశీబుగ్గ, నయీంనగర్‌, రెవెన్యూ కాలనీ ప్రాంతాల్లో ఈ సేవలు లభిస్తాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. కరీంనగర్‌లో సిరిసిల్ల రోడ్డు, అదర్శ్‌నగర్‌, చైతన్యపురి, సరస్వతి నగర్‌, సీతారాంపుర్‌, సాలేహ్‌నగర్‌ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ సేవలు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే 5జీ ప్లస్ సేవలను వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు. కరీంనగర్‌, వరంగల్‌తో కలిపి ఎయిర్‌టెల్‌ ఇప్పటికే 67 నగరాల్లో తన 5జీ ప్లస్ సేవలను అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని