Airtel 5G: ఇకపై అన్ని శాంసంగ్‌ 5జీ ఫోన్లలో ఎయిర్‌టెల్‌ 5జీ!

శాంసంగ్ 5జీ ఫోన్‌ యూజర్లకు ఎయిర్‌టెల్ తీపి కబురు చెప్పింది. తాజాగా విడుదల చేసిన ఓఎస్‌ అప్‌డేట్‌తో అన్ని శాంసంగగ్‌ 5జీ ఫోన్లు ఎయిర్‌టెల్ 5జీ ప్లస్‌ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయని తెలిపింది.

Published : 25 Nov 2022 19:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ప్రముఖ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఓఎస్‌ సపోర్ట్ చేయని కారణంగా కొన్ని స్మార్ట్‌ఫోన్లలో 5జీ నెట్‌వర్క్‌ పనిచేయడంలేదు. దీంతో మొబైల్‌ కంపెనీలు ఓవర్‌ ది ఎయిర్‌ (OTA) ఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాయి. తాజాగా శాంసంగ్‌ విడుదల చేసిన అప్‌డేట్‌తో ఇకపై అన్ని శాంసంగ్‌ 5జీ  మోడల్స్‌లోనూ ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అతి తక్కువ సమయంలో ఓటీఏ ద్వారా  శాంసంగ్‌ 5జీ ఓఎస్‌ అప్‌డేట్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ 5జీ ఎన్‌ఎస్‌ఏ (నాన్‌-స్టాండ్‌అలోన్‌) ద్వారా 5జీ సేవలను అందిస్తోంది. రాబోయే రోజుల్లో ఎస్‌ఏ (Standalone) ద్వారా అందిస్తామని ఎయిర్‌టెల్ తెలిపింది. 

5జీ సేవలు ప్రారంభించిన నెలరోజుల్లోనే 10 లక్షల మంది యునిక్‌ యూజర్ల మైలురాయిని ఎయిర్‌టెల్‌ చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై బెంగళూరు, సిలిగుడి, నాగ్‌పూర్‌, వారణాశి, పుణె, గుడ్‌గావ్‌, గువహటి, పానిపట్‌ నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ నెట్‌వర్క్‌ సేవలను అందిస్తోంది. వీటితోపాటు వారణాశి, పుణె, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో కూడా 5జీ ప్లస్‌ నెట్‌వర్క్ సేవలు అందుబాటులో ఉన్నాయి. గతవారం ఎయిర్‌టెల్‌ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌3, గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌3 మోడల్స్‌ మినహా అన్ని ఫోన్లు ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయని తెలిపింది. తాజా అప్‌డేట్‌తో ఆ రెండు ఫోన్లు కూడా ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయని వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని