Airtel 5g: ఒకేరోజు 125 నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు

Airtel 5g coverage: ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు మరో 125 నగరాలకు విస్తరించాయి. దీంతో మొత్తం నగరాల సంఖ్య 265కి చేరింది. తాజాగా ఏపీలోని నెల్లూరు, అనంతపురంలోనూ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Published : 06 Mar 2023 21:48 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel 5g) తన 5జీ సేవలను (5g Services) మరిన్ని నగరాలకు విస్తరించింది. సోమవారం ఒక్కరోజే 125 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. ఒకేసారి ఇన్ని నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఇదే ప్రథమం. దీంతో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల సంఖ్య 265కి చేరినట్లు ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగానే ఒకేసారి 125 నగరాల్లో సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది.

తాజాగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల్లో ఏపీ నుంచి నెల్లూరు, అనంతపురంతో అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మరికొన్ని పట్టణాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ 5జీ కవరేజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఎయిర్‌టెల్‌ సీటీఓ రణ్‌దీప్‌ సెఖాన్‌ తెలిపారు. 5జీ కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్‌ దేశ గతిని మార్చనున్నాయని చెప్పారు.  ఉత్తరాన జమ్మూ మొదలు కొని, దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకు ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయ్యిందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు