Airtel Black: ఎయిర్‌టెల్ మరో కొత్త బ్లాక్‌ ప్లాన్‌.. టెలికాంతో పాటు ఫైబర్‌సేవలు

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharati airtel) తమ బ్లాక్‌ యూజర్ల కోసం రూ.998తో కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. టెలికాం సేవలతో పాటు బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను కూడా ఈ ప్లాన్‌ కింద అందిస్తోంది.

Published : 27 Mar 2023 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharati airtel) రూ.998తో మరో బ్లాక్‌ ప్లాన్‌ను (Airtel Black) ప్రవేశపెట్టింది. ఇందులో రెండు పోస్ట్‌ పెయిడ్‌ సర్వీసులతో పాటు ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పొందవచ్చు. ఎయిర్‌టెల్‌ ప్రీమియం సర్వీసుగా వ్యవహరించే ఈ బ్లాక్‌ ప్లాన్‌లో ఓటీటీ సేవలు (OTT) కూడా లభిస్తాయి.

ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన సరికొత్త ప్లాన్‌తో రెండు సిమ్‌కార్డులు తీసుకోవచ్చు. ఒక రెగ్యులర్‌ సిమ్‌ కార్డ్‌తో పాటు అదనంగా మరో సిమ్‌ కార్డును పొందొచ్చు. రెండు పోస్ట్‌పెయిడ్‌ సేవలతో పాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ కూడా లభిస్తుంది. పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్‌ కింద అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. నెలవారీ 105జీబీ అపరిమిత డేటా లభిస్తుంది. (200జీబీ వరకు వాడుకోని డేటాను తర్వాతి నెలకు బదిలీ అవుతుంది.) అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్‌, కొన్ని ఇతర ఓటీటీ సేవలు ఉచితంగా పొందవచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్ సర్వీసులతో పాటు వింక్‌ మ్యూజిక్‌, హలో ట్యూన్స్‌ ఈ ప్లాన్‌తో లభిస్తాయి. ఇక ఫైబర్‌ కనెక్షన్‌ కింద బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌తో పాటు ల్యాండ్‌లైన్‌ సర్వీసులు కూడా పొందొచ్చు. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌తో 40 Mbps వేగంతో అపరిమిత డేటాతో పాటు ల్యాండ్‌లైన్‌ ద్వారా అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు.

బ్లాక్‌ ప్లాన్‌ తీసుకునే వారికి ప్రీమియం సర్వీసులు అందుతాయి. వన్‌ బిల్‌ - వన్‌ కాల్‌ సెంటర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక టీమ్‌ ఉంటుంది. కేవలం 60 సెకన్లలో కస్టమర్ కేర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అందుబాటులోకి వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఫ్రీసర్వీస్‌ విజిటర్లు, బై నౌ- పే లేటర్‌ సదుపాయం లభిస్తాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ను వినియోగిస్తున్న వారితో పాటు కొత్త వినియోగదారులు సైతం ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. మొదటి 30 రోజులు ఉచితంగా సేవలు ఆనందించొచ్చు. ఉచిత ఇన్‌స్టలేషన్‌తో పాటు ఏడాది పాటు పోస్ట్‌పెయిడ్‌ బిల్లులపై నెలకు రూ.100 ఆఫర్‌ వంటి ఇతర ప్రయోజనాలున్నాయి. అయితే ఉచిత ఇన్‌స్టలేషన్‌ కోసం వినియోగదారు ఎంచుకున్న ప్లాన్‌ ప్రకారం ముందుగానే డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ప్లాన్‌ మొత్తంలో తర్వాత సర్దుబాటు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని