Airtel నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌.. బెన్‌ఫిట్స్‌ ఇవే..

Airtel prepaid plans: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ (Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రకటించింది.

Published : 15 Aug 2022 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ (Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రకటించింది. రూ.519, రూ.779 విలువ గల రెండు సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రోజుకు 1.5 జీబీ డేటా కలిగిన ఈ రెండు ప్లాన్లలో ఒకటి 2 నెలలు, మరొకటి 3 నెలల వ్యాలిడిటీతో వస్తున్నాయి. పూర్తి క్యాలెండర్‌ నెల రీఛార్జి కోరుకునే వారు ఈ ప్లాన్లపై ఓ లుక్కేయొచ్చు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల జియో పలు ఆఫర్లు ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్లను తీసుకొచ్చింది.

ప్లాన్ల విషయానికొస్తే.. రూ.519 ప్లాన్‌ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అపోలో 24/7 సర్కిల్‌, హలో ట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌ వంటి ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ బెన్‌ఫిట్స్‌ లభిస్తాయి. 779 ప్లాన్‌ సైతం దాదాపు ఇవే ప్రయోజనాలను అందిస్తోంది. 90 రోజుల వ్యాలిడిటీకి గానూ మొత్తం 135 జీబీ డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ బెనిఫిట్స్‌ ఈ ప్యాక్‌తోనూ లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని