Airtel: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్!
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం భారతీ ఎయిర్టెల్ కొత్త మొబైల్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది.
దిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం భారతీ ఎయిర్టెల్ కొత్త మొబైల్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. వరల్డ్ పాస్ (World Pass) పేరుతో విడుదల చేసిన ఈ రోమింగ్ ప్లాన్‌తో 184 దేశాల్లో ఎయిర్టెల్ సేవలు పొందొచ్చు. అంటే, ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ దేశాల్లో ఎలాంటి ప్రత్యేకమైన రీఛార్జ్ అవసరం లేకుండా ఎయిర్టెల్ సేవలు పొందవచ్చు. ఈ ప్లాన్ పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది.
ఎయిర్టెల్ వరల్డ్పాస్ ద్వారా యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన సేవలు కూడా అందిస్తోంది. వినియోగదారులకు 99100-99100 నంబర్ ద్వారా 24x7 ఎయిర్టెల్ ప్రతినిధులతో వాట్సాప్ లేదా సాధారణ కాల్స్ ద్వారా సంభాషించవచ్చు. ఈ ప్లాన్ ప్రారంభ ధర రూ. 649. ఇందులో యూజర్లు ఒకరోజు వ్యాలిడిటీతో వంద నిమిషాల టాక్‌టైంతోపాటు 500ఎంబీ వేగంతో అన్లిమిటెడ్ డేటా పొందుతారు. ఎక్కువకాలం విదేశాల్లో ఉండేవారికోసం 365 రోజుల వ్యాలిడిటీ, మూడు వేల నిమిషాల టాక్‌టైం, 15జీబీ వేగంతో డైలీ అన్లిమిటెడ్ డేటా ప్లాన్ కూడా ఉంది. దీని ధర రూ. 14,999. వరల్డ్పాస్ రీఛార్జ్ ప్లాన్ల పూర్తి వివరాలు ఈ కింద పట్టికలో చూడొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
-
Sports News
IND vs NZ: సిరీస్ ఖాతాలో పడాలంటే.. టాప్ ఆర్డర్ గాడిలో పడాల్సిందే!
-
General News
Andhra news: రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది: బండి శ్రీనివాస్
-
General News
TSWRES: తెలంగాణ గురుకుల సైనిక స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
-
Movies News
srirama chandra: సింగర్ అసహనం.. ఫ్లైట్ మిస్సయిందంటూ కేటీఆర్‌కు విజ్ఞప్తి..!
-
India News
Temjen Imna Along: ‘నా పక్కన కుర్చీ ఖాళీగానే ఉంది’.. పెళ్లి గురించి మంత్రి ఆసక్తికర ట్వీట్