Published : 30 May 2022 15:01 IST

Airtel Broadband Plans: 17 ఓటీటీలతో ఎయిర్‌టెల్‌ కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీ ఎయిర్‌టెల్‌ మరో మూడు కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో 17 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌తో పాటు డీటీహెచ్‌ కనెక్షన్‌ కూడా వస్తోంది. పైగా ప్రత్యేక రిలేషన్‌షిప్‌ మేనేజర్‌తో యూజర్లకు ఎయిర్‌ బ్లాక్‌ ప్రియారిటీ కేర్‌ను కూడా అందిస్తున్నారు. వీటి ధరలు వరుసగా నెలకు రూ.1,599, రూ.1,099, రూ.699గా ఉన్నాయి.

రూ.1,599 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌..

ఈ ప్లాన్‌లో నెలకు 3.3 టీబీ ఎఫ్‌యూపీ (fair-usage-policy) డేటా 300 ఎంబీపీఎస్‌ వేగంతో లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ సహా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీం ప్రీమియం సింగిల్‌ లాగిన్‌తో 14 ఓటీటీలకు యాక్సెస్‌ పొందొచ్చు. వీటిలో సోనీలివ్‌, ఈరోస్‌నౌ, లయన్స్‌గేట్‌ ప్లే, మనోరమామ్యాక్స్‌ వంటి ప్రముఖ ఓటీటీలు ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ 4కే ఎక్స్‌ట్రీం బాక్స్‌కు ఒకేసారి రూ.2,000 చెల్లించడం ద్వారా 350+ ఛానెళ్లను పొందే అవకాశం కూడా ఎయిర్‌టెల్‌ కల్పిస్తోంది. ఈ సెటాప్‌ బాక్స్‌తో వినియోగదారులు లీనియర్‌, ఓటీటీ కంటెంట్‌ను వీక్షించొచ్చు.

రూ.1,099 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌..

దీంట్లో నెలకు 3.3 టీబీ ఎఫ్‌యూపీ డేటా 200 ఎంబీపీఎస్‌ వేగంతో రానుంది. ఒక్క నెట్‌ఫ్లిక్స్‌ తప్ప రూ.1,599 ప్లాన్‌ లభిస్తోన్న ఓటీటీలన్నీ దీంట్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీం బాక్స్‌ ఆఫర్‌తో 350+ పైగా ఛానెళ్లను కూడా పొందొచ్చు.

రూ.699 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌..

ఈ రూ.699 ప్లాన్‌లో నెట్‌ వేగం 40 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. నెలకు 3.3 టీబీ డేటా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ తప్ప పైన తెలిపిన వాటిలో 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. ఈ మూడు ప్లాన్‌లను యూజర్లు నేరుగా కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని