Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు అలెర్ట్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఇక సగం రోజులే!

ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌ ఎయిర్‌టెల్‌ తన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లను సవరించింది. ఆయా ప్లాన్లలో భాగంగా ఉచితంగా అందిస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ (Amazon prime) గడువును తగ్గించింది.

Published : 21 Apr 2022 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌ ఎయిర్‌టెల్‌ తన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లను సవరించింది. ఆయా ప్లాన్లలో భాగంగా ఉచితంగా అందిస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ (Amazon prime) గడువును తగ్గించింది. ₹499, ₹999, ₹1199, ₹1599 ప్లాన్లలో భాగంగా ఏడాది పాటు అమెజాన్‌ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుండగా.. ఇకపై కేవలం ఆరు నెలలు మాత్రమే ఎయిర్‌టెల్‌ అందించనుంది. 

ఈ నాలుగు ప్లాన్లపై అమెజాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ గడువు కోత ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఆ తేదీ తర్వాత రీఛార్జి చేసుకున్న వారికి ఆరు నెలల గడువే వర్తిస్తుంది. ఏప్రిల్‌ 1 కంటే ముందు రీఛార్జి చేసుకున్న వారికి మాత్రం సంవత్సరం చందా అమలౌతుంది. మరికొన్ని బ్రాడ్‌బాండ్‌ ప్లాన్లపైనా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్‌టెల్‌ అందిస్తుండగా.. వాటిలో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే, గతంతో పోలిస్తే అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ 50 శాతం మేర పెరిగింది. సంవత్సరం చందా ఒకప్పుడు రూ.999 ఉండగా.. అది రూ.1499కి చేరింది. ఎయిర్‌టెల్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మిగిలిన టెలికాం కంపెనీలు సైతం ఇదే బాటను అనుసరించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని