Airtel Prepaid Plan: ఒకే ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో 3 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు

Airtel Prepaid Plan: మూడు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఒకే ప్లాన్‌లో ఉండేలా ఎయిర్‌టెల్‌ ప్రత్యేక ప్రెపెయిడ్‌ ప్యాక్‌ను అందిస్తోంది. దీని ధర రూ.999. కాలపరిమితి 84 రోజులు.

Updated : 07 Mar 2023 17:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తమ యూజర్ల కోసం అనేక రకాల ప్రీపెయిడ్‌ ప్యాక్‌ (Airtel Recharge Plans)లను అందిస్తోంది. అపరిమిత ప్లాన్‌లు, డేటా యాడ్‌-ఆన్‌లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు (OTT Subscriptions).. ఇలా వివిధ కాంబినేషన్లలో రీఛార్జ్‌ ఆప్షన్లను ఇస్తోంది. ఈ క్రమంలో సరిపడా రోజువారీ డేటాతో పాటు ఓటీటీ ప్రయోజనాలు కావాలనుకునేవారికి రూ.999తో ఎయిర్‌టెల్‌ ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది.

ప్లాన్‌ వివరాలు..

  • రోజుకు 2.5 జీబీ డేటా
  • అపరిమిత వాయిస్‌ కాల్స్‌
  • రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు
  • కాలపరిమితి 84 రోజులు
  • మూడు నెలల వరకు అపోలో 24x7 సర్కిల్‌ సేవలు
  • ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌
  • ఉచిత వింక్‌ మ్యూజిక్‌
  • ఉచిత హలో ట్యూన్స్‌
  • రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్‌

ఓటీటీ ప్రయోజనాలు..

మూడు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉండడం ఈ ప్లాన్‌ ప్రత్యేకత. అదీ 84 రోజుల కాలపరిమితితో. ఎయిర్‌టెల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునే వారు మూడు నెలల కాలపరిమితో డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. అలాగే 84 రోజుల వ్యాలిడిటీతో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కూడా వస్తుంది. వీటితో పాటు 84 రోజుల గడువుతో ఎక్స్‌ట్రీం యాప్‌ యాక్సెస్‌ కూడా పొందొచ్చు. ఎక్స్‌ట్రీంలో ఉండే సోనీ లివ్‌, లయన్స్‌గేట్‌ ప్లే, ఈరోస్‌ నౌ, హోయ్‌చొయ్‌, మనోరమామ్యాక్స్‌, చౌపల్‌, కచ్చాలంకా.. వీటిలో ఏదైనా ఒక ఛానెల్‌ను ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండానే పొందొచ్చు. ఇలా మొత్తంగా మూడు ఓటీటీలను ఎంజాయ్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని