Airtel Prepaid Plans: ₹399తో 3నెలల డిస్నీ+ హాట్‌స్టార్.. ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు!
ఎయిర్టెల్ తమ యూజర్ల కోసం డిస్ని+ హాట్‌స్టార్‌తో కూడిన మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది.....
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్టెల్ తమ యూజర్ల కోసం మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది. వీటిలో మూడు నెలల కాలపరిమితితో కూడిన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సభ్యత్వం ఉండడం విశేషం. 28 రోజుల కాలపరిమితితో కూడిన కొత్త ప్లాన్ ధర రూ.399. మరో దాంట్లో 84 రోజుల వ్యాలిడిటీ ఉంది. దీని ధర రూ.839. ఈ రెండింటిలో అపరిమిత కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఇప్పటికే ఎయిర్టెల్ దాదాపు ఇవే ప్రయోజనాలతో రూ.499, రూ.599, రూ.2999, రూ.3359 ప్లాన్లను అందిస్తోంది. అయితే, వీటిలో డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం ఏడాది కాలపరిమితితో రావడం గమనార్హం. జియో ఇటీవల ప్రారంభించిన మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లకు పోటీగా ఎయిర్టెల్ వీటిని తీసుకొచ్చింది.
- రూ.399 కొత్త ప్లాన్‌లో రోజుకి 2.5 జీబీ డేటా వస్తోంది. అదే రూ.839 ప్లాన్‌లో రోజుకి 2జీబీ డేటా అందిస్తున్నారు. ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్‌లో సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ఈరోస్ నౌ, హొయ్‌చొయ్, మనోరమ మ్యాక్స్ వంటి ఛానెళ్లలో ఏదో ఒకదానికి అనుమతి పొందొచ్చు.
- ఈ రెండు కొత్త ప్లాన్లలో 30 రోజుల కాలపరిమితితో కూడిన ఉచిత అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉచిత ట్రయల్‌ను పొందొచ్చు. ఈ ట్రయల్ కేవలం ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- వీటితో పాటు అపోలో 24/7 సర్కిల్‌కు ఉచిత అనుమతి లభిస్తుంది. షా అకాడమీ ఆన్లైన్ కోర్సులు, ఫాస్టాగ్ లావాదేవీలపై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హలో ట్యూన్స్, వింక్‌మ్యూజిక్ ఉచిత సబ్స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!