Airtel prepaid plans: ఎయిర్‌టెల్‌లో మరో 2 కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్.. ప్రయోజనాలివే!

Airtel Recharge: ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేలా ఎయిర్‌టెల్‌ మరో రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది.

Updated : 27 Jan 2023 14:50 IST

దిల్లీ: తమ యూజర్ల కోసం టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) మరో రెండు సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను (prepaid plans) తీసుకొచ్చింది. అపరిమిత కాల్స్, ఎక్కువ డేటా వినియోగించేవారికి ఇవి సరైన ప్లాన్స్ అని ఎయిర్‌టెల్‌ వర్గాలు తెలిపాయి. నెలకు 60 జీబీ డేటా అందించే కొత్త ప్లాన్లతో ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ల మధ్య వ్యత్యాసం తగ్గనున్నట్లు పేర్కొన్నాయి.

కొత్త ప్లాన్ల వివరాలివీ..

రూ.489 ప్లాన్‌ ఫీచర్లు..

30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, నెలకు 300 ఉచిత ఎస్సెమ్మెస్‌లు, 50 జీబీ డేటాను అందిస్తోంది. దీంతో పాటు అదనంగా ఉచిత వింక్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్, అపోలో 24/7 సర్కిల్‌, ఫాస్టాగ్‌పై క్యాష్‌బ్యాక్‌ వంటి ప్రయోజనాలు అదనం.

రూ.509 ప్లాన్

30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, నెలకు 300 ఉచిత ఎస్సెమ్మెస్‌లు, 60 జీబీ డేటాతో పాటు అదనంగా ఉచిత వింక్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్, అపోలో 24/7 సర్కిల్‌, ఫాస్టాగ్‌పై క్యాష్‌బ్యాక్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఎయిర్‌టెల్‌ ఇటీవలే కనీస రీఛార్జి ప్లాన్ ధరను దాదాపు 57 శాతం పెంచి రూ.155 చేసిన విషయం తెలిసిందే. ఈ సరికొత్త ప్లాన్‌తో అపరిమిత కాల్స్‌, 1 జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని