Airtel Recharge: రూ.149 డేటావోచర్‌తో 15 ఓటీటీలుండే ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌నకు యాక్సెస్‌

Airtel Recharge: ఎయిర్‌టెల్‌ రూ.149 డేటా వోచర్‌లో డేటాతో పాటు ఓటీటీ ప్రయోజనాలను (OTT Benefits) కూడా కల్పిస్తోంది.

Published : 08 Mar 2023 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel Recharge) రూ.200లోపే ఓటీటీ ప్రయోజనాలను (OTT Benefits) అందిస్తోంది. వివిధ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లను వీక్షించాలనుకునే యూజర్లకు ఇది మంచి ఆఫర్‌. రూ.149 డేటా వోచర్‌లో డేటాతో పాటు ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్రయోజనాలను (OTT Benefits) కూడా కల్పిస్తోంది. దీన్ని ఇటీవలే ప్రవేశపెట్టింది. ఎక్స్‌ట్రీం ప్రీమియం (Airtel Xstream) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో మార్పులు చేసి దీన్ని తీసుకొచ్చినట్లు టెలికాం నిపుణులు చెబుతున్నారు.

రూ.149 డేటా వోచర్‌తో రీఛార్జ్‌ చేస్తే 1 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటే ఎక్స్‌ట్రీం యాప్‌నకు కూడా యాక్సెస్‌ లభిస్తుంది. దీంట్లో 15కు పైగా ఓటీటీలు ఉన్న విషయం తెలిసిందే. సోనీలివ్‌, లయన్స్‌గేట్‌ప్లే, హొయ్‌చొయ్‌, చౌపల్‌, కచ్చాలంకా, ఈరోస్‌నౌ, మనోరమామ్యాక్స్‌, హంగామా, డాక్యూబే వంటి ప్రముఖ ఛానళ్లలోని కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఎక్స్‌ట్రీం (Airtel Xstream) ప్రీమియం వ్యాలిడిటీ 30 రోజులు. 1జీబీ డేటాను మాత్రం యాక్టివ్‌లో ఉన్న ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ముగిసే వరకు వాడుకోవచ్చు. డేటా కోసం మాత్రమే రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే యూజర్లకు ఇది అంత ఉపయోగకరంగా ఉండదు.

ఒక్క రూ.149 డేటా వోచర్‌ మాత్రమే కాదు.. ఎక్స్‌ట్రీం యాప్‌ యాక్సెస్‌ ఇతర ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ల ద్వారా కూడా పొందొచ్చు. అయితే, వాటిలో ఎక్స్‌ట్రీంలోని ఏదో ఒక ఛానల్‌ను మాత్రమే వీక్షించడానికి అనుమతి ఉంటుంది. కానీ, రూ.149 డేటా వోచర్‌లో మాత్రం యాప్‌లో ఉన్న అన్ని ఓటీటీలను ఎంజాయ్‌ చేయొచ్చు. పైగా ఒక్క స్మార్ట్‌ఫోన్‌లోనే కాదు.. టీవీ, పీసీల్లోనూ యాప్‌నకు యాక్సెస్‌ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని