1Gbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌.. Airtel Xstream Fiber ఇన్ఫినిటీ ప్లాన్‌

Airtel Xstream Fiber: ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ బేసిక్‌ ప్లాన్‌ రూ.499 నుంచి ప్రారంభమవుతోంది. ఇన్ఫినిటీ ప్లాన్‌ ద్వారా వేగవంతమైన, ఎక్కువ మొత్తంలో డేటాను వినియోగించుకోవచ్చు.

Published : 11 Mar 2023 00:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ (Airtel Xstream Fiber) పేరిట భారతీ ఎయిర్‌టెల్‌ దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్ని అందిస్తోంది. 40 ఎంబీపీఎస్‌ మొదలుకొని 1 Gbps వరకు అత్యంత వేగంగా ఇంటర్నెట్‌ సేవలను ఇస్తోంది. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను అందుబాటులో ఉంచింది.

భారీ మొత్తంలో డేటా అవసరం ఉండి.. అదీ ఎక్కువ డివైజ్‌లు వాడే ఇళ్లకు గిగాబిట్‌ కనెక్షన్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీల్లో ఒకేసారి ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇన్ఫినిటీ ప్లాన్‌ (Airtel Infinity Plan) పేరిట ఈ గిగాబిట్‌ కనెక్షన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వివరాలేంటో చూద్దాం..

ఈ ప్లాన్‌ ధర నెలకు రూ.3,999. ఈ ఇన్ఫినిటీ ప్లాన్‌ (Airtel Infinity Plan)లో డేటా వినియోగంపై ఎలాంటి పరిమితి ఉండదు. వేగం 1 జీబీపీఎస్‌ వరకు ఉంటుంది. అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాలింగ్‌ ప్రయోజనాలతో ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ కూడా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రీమియం, ఎయిర్‌టెల్‌ వీఐపీ సర్వీస్‌ కూడా ఉంటాయి. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ బెనిఫిట్స్‌ని కూడా పొందొచ్చు. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌లో ఏడాది పాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7, ఫాస్టాగ్‌ రీఛార్జ్‌, వింక్‌ మ్యూజిక్‌ ఉంటాయి.

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్రస్తుతానికి 1,140 పట్టణాల్లో అందుబాటులో ఉంది. త్వరలో మరో 150 నగరాలకూ ఈ సేవలను విస్తరించనున్నారు. ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ బేసిక్‌ ప్లాన్‌ రూ.499 నుంచి ప్రారంభమవుతోంది. దీంట్లో 40 ఎంబీపీఎస్‌ వేగం వద్ద అపరిమిత ఇంటర్నెట్‌, ల్యాండ్‌లైన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ లోకల్‌ ఎస్‌టీడీ కాల్స్‌, ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ప్రయోజనాలను పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని