Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక లాంఛనమే
Ajay Banga: బంగాకు పోటీగా ఇతర ఏ దేశమూ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చిందని ప్రపంచ బ్యాంకు గురువారం ప్రకటించింది.
Ajay Banga | వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే! ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఆయా దేశాలు తమ అభ్యర్థులను నామినేట్ చేయడానికి బుధవారంతో గడువు ముగిసింది. బంగాకు పోటీగా ఇతర ఏ దేశమూ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ఈ పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చిందని ప్రపంచ బ్యాంకు గురువారం ప్రకటించింది. దీంతో అమెరికా ఎంపిక చేసిన మన అజయ్ బంగా (Ajay Banga)నే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నిక కానుండడం దాదాపు ఖరారైంది. నిబంధన ప్రకారం వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు అజయ్ బంగాను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది.
ఆ ప్రక్రియ సవ్యంగా సాగితే.. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా, సిక్కు అమెరికన్‌గా బంగా (Ajay Banga) చరిత్ర సృష్టిస్తారు. ఆయన వయసు 63 ఏళ్లు. ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ కంపెనీ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో మాస్టర్‌కార్డ్ అధ్యక్షుడు-సీఈవోగా విధులు నిర్వర్తించారు. 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సామర్థ్యం బంగాకు ఉందని.. ఆయనను నామినేట్ చేసిన సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ కంపెనీలను విజయవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతమని వ్యాఖ్యానించారు. పర్యావరణ మార్పుల అంశం సహా ప్రపంచం ముందు ప్రస్తుతమున్న అన్ని సవాళ్లను బంగా సమర్థంగా ఎదుర్కోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి ఎన్నికకు ఇదీ తంతు! )
ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ తన పదవీకాలం ముగియక ముందే పదవీవిరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. డేవిడ్ మాల్పాస్ ప్రకటన తర్వాత ప్రపంచ బ్యాంకు నామినేషన్లను స్వీకరించడం మొదలు పెట్టింది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. సాధారణంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికన్, ఐఎంఎఫ్ అధ్యక్షుడిగా యూరోపియన్ దేశానికి చెందిన వ్యక్తి ఉండడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా (Ajay Banga) ఎన్నిక కావడం దాదాపు ఖాయమనే అంచనాలు ఆయనను నామినేట్ చేసిన సమయంలోనే వచ్చాయి. ప్రపంచ బ్యాంకులో అత్యధిక వాటా అమెరికాదే. అందువల్ల అధ్యక్షుడి నియామకంలో అగ్రరాజ్యం మాటే చెల్లుబాటు అవుతుంటుంది.
అజయ్ బంగా (Ajay Banga) పుణె లోని ఖడ్కీలో జన్మించారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన.. ఆహ్మదాబాద్ ఐఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం ఆయన్ను గౌరవిస్తూ 2016లో పద్మశ్రీతో సత్కరించింది. 2012లో విదేశాంగ విధాన సంఘం అవార్డు సాధించారు. 2019లో ది ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ హానర్, బిజినెస్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ గ్లోబర్ లీడర్ షిప్ అవార్డు పొందారు.
(ఇదీ చదవండి: అజయ్ బంగా.. మన హెచ్‌పీఎస్ విద్యార్థే)
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
-
World News
Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్ దిగ్భ్రాంతి
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం