Akasa Air: 10 నుంచి విశాఖ- బెంగళూరు రూట్‌లో ఆకాశ ఎయిర్‌ సేవలు

దేశీయ విమాన సంస్థ ఆకాశ ఎయిర్‌ విశాఖ నుంచి తన విమాన సర్వీసులు ప్రారంభించబోతోంది. విశాఖ-బెంగళూరు మధ్య  రోజుకు రెండేసి సర్వీసులు నడపనుంది.

Published : 18 Nov 2022 20:20 IST

ముంబయి: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ (Akasa Air) త్వరలో విశాఖ నుంచి తన విమాన సర్వీసులు ప్రారంభించబోతోంది. విశాఖ-బెంగళూరు మధ్య సర్వీసులు నడపనుంది. డిసెంబర్‌ 10 నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని ఆ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్‌.. తన పదో గమ్యస్థానంగా విశాఖ నుంచి ఈ సేవలు ప్రారంభించబోతోంది.

విశాఖ- బెంగళూరు మార్గంలో రోజుకు రెండేసి సర్వీసులు నడవనున్నాయి. డిసెంబర్‌ 10న తొలి సర్వీసు.. 12 నుంచి రెండో సర్వీసును ప్రారంభించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సేవల ప్రారంభించడం ద్వారా బెంగళూరు నుంచి 8 నగరాలకు రోజుకు 24 నాన్‌స్టాప్‌ సర్వీసులను ప్రారంభించినట్లు అవుతుందని తెలిపింది. మొత్తం 10 గమ్యస్థానాల్లో 8 నగరాలు బెంగళూరుతో అనుసంధానం అవుతున్నాయి.

మరోవైపు నవంబర్‌ 26 నుంచి పుణె- బెంగళూరు మధ్య రెండు సర్వీసులు చొప్పున నడపనున్నట్లు ప్రకటించిన ఆకాశ ఎయిర్‌.. డిసెంబర్‌ 10 నుంచి మూడో సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపింది. భారీ డిమాండ్‌ దృష్ట్యా డిసెంబర్‌ 17 నుంచి బెంగళూరు- అహ్మదాబాద్‌ మధ్య మూడో సర్వీసును ప్రారంభించబోతున్నట్లు పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు