NPS చందాదారులకు అలర్ట్.. ఇకపై UPI ద్వారా పేమెంట్స్
ఇకపై మీ పెట్టుబడులను యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్) ద్వారా చేయవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: మీరు ఎన్పీఎస్ (NPS) చందాదారులా? అయితే, ఇకపై మీ పెట్టుబడులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్ (UPI) ద్వారా కూడా చేయొచ్చు. చందాదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (PFRDA) తెలిపింది. ప్రస్తుతం చందాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాధ్యమాలైన IMPS, NEFT, RTGS ద్వారా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు దేశీయ ఇన్స్టంట్ రియల్-టైమ్ పేమెంట్స్ సిస్టమ్ UPI ద్వారా కూడా చందాదారులు మరింత సులభంగా, వేగంగా, సరళంగా పెట్టుబడులు పెట్టొచ్చు.
ఇందుకోసం యూపీఐ హ్యాండిల్ (PFRDA.15digitVirtualAccount@axisbank)ను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. అలాగే డీ-రెమిట్ వర్చువల్ అకౌంట్, అనుబంధిత శాశ్వత ఖాతా సంఖ్య (PRAN)కి భిన్నంగా ఉంటుంది. ఇది 6001 లేదా 6002 నుంచి ప్రారంభమవుతుందని పీఎఫ్ఆర్డీఏ తెలియజేసింది. అలాగే, టైర్ I & II ఖాతాలకి కూడా డీ-రెమిట్ వర్చువల్ ఖాతా సంఖ్య వేరు వేరుగా ఉంటుంది. ఈ యూపీఐ ఫీచర్ ద్వారా ఖాతాదారులు NPS స్కీమ్ పెట్టుబడులను ఒకే రోజులో పూర్తిచేయొచ్చు.
డీ-రెమిట్ కాంట్రిబ్యూషన్లు ట్రస్టీ బ్యాంక్ ఉదయం 09:30 ముందే స్వీకరించినట్లయితే అదే రోజు పెట్టుబడులు పెట్టినట్లుగా పరిగణిస్తారు. ఒకవేళ ఉదయం 09:30 తర్వాత కాంట్రిషన్లను ట్రస్టీ బ్యాంక్ స్వీకరిస్తే వాటిని తర్వాతి రోజు పెట్టుబడులుగా పరిగణిస్తారని పీఎఫ్ఆర్డీఏ మార్గదర్శకాలలో తెలిపింది. అంతే కాకుండా యూపీఐ హ్యాండిల్ పిరియాడికల్ (నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక.. మొదలైన) ఆటో డెబిట్ ప్రయోజనాన్ని అందిస్తుంది.
డీ-రెమిట్ కింద కాంట్రిబ్యూట్ చేసే కనీస మొత్తం రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అందువల్ల యూపీఐ ఆధారిత డిపాజిట్లు రూ.500 కంటే తక్కువ ఉంటే వాటిని ఆమోదించరు. ట్రస్టీ బ్యాంకుకి తిరిగి పంపిస్తారు. ఒకవేళ చందాదారులు స్తంభించిన/క్రియారహితంగా ఉన్న ప్రాన్ల కోసం కాంట్రిబ్యూట్ చేసినట్లు సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజన్సీ (CRA) నిర్ధారిస్తే అటువంటి చెల్లింపులను కూడా తిరిగి ట్రస్టీ బ్యాంకుకి పంపిస్తారు.
యూపీఐ హ్యాండిల్ వినియోగం ఇలా..
- స్టెప్ - 1: ముందుగా సీఆర్ఏ సిస్టమ్ వెబ్సైట్లో అందుబాటులో ఉండే E-NPS పేజీని ఓపెన్ చేయండి.
- స్టెప్ - 2: ప్రాన్ నంబరు వెరిఫై చేసేందుకు ఇక్కడ ప్రాన్ నంబరు, పుట్టిన తేదీ తదితర వివరాలను ఇచ్చి వెరిఫై పై క్లిక్ చేయాలి.
- స్టెప్ - 3: మీ మొబైల్ నంబరు/ఈ-మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేయాలి.
- స్టెప్ - 4: మీరు టైర్ I లేదా టైర్ II ఖాతాలలో దేనికి వర్చువల్ అకౌంట్‌ను కావాలనుకుంటున్నారో ఎంచుకోండి.
- స్టెప్ - 5: ఇక్కడ ఇచ్చిన వివరాలను పూర్తిగా చదివి మీ సమ్మతి తెలియజేయండి.
- స్టెప్ - 6: ఆ తర్వాత జనరేట్ వర్చువల్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి. ఇది పూర్తి చేసిన తర్వాత మీ అభ్యర్థన ట్రస్టీ బ్యాంకుకి ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ కనిపిస్తుంది. టైర్ I, టైర్ II ఖాతాలకు విడివిడిగా నంబరు జనరేట్ అవుతుంది.
- స్టెప్ - 7: ప్రాన్కి నిధులను పంపించడం కోసం యూపీఐ హ్యాండిల్లో 15 అంకెల వర్చువల్ అకౌంట్ నంబరును ఇక్కడ తెలిపిన ఫార్మాట్ PFRDA.15digitVirtualAccount@axisbankలో నమోదు చేయాలి.
- స్టెప్ - 8: ఏదైనా పనిదినాల్లో ఉదయం 9:30లోపు నిధులను పంపితే అదే రోజు NAV (నెట్ ఎసెట్ వాల్యూ)తో లెక్కలోకి తీసుకుంటారు. ఒకవేళ ఉదయం 9:30 దాటిన తర్వాత అయితే, తర్వాతి రోజు పెట్టుబడులు పెట్టినట్లు చూపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
చిన్న, మధ్యస్త REITS ద్వారా స్థిరాస్తిలో పెట్టుబడులు.. సురక్షితమేనా?
తరతరాలుగా భారతీయులు స్థిరాస్తి, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులను గౌరవిస్తున్నారు. మారుతున్న కాలంలో స్థిరాస్తి పెట్టుబడులకు మారో రూపమే SM REITS.. వీటి గురించి తెలుసుకోండి. -
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
కుటుంబానికి ధీమానిచ్చేలా.. బీమా పాలసీ
సంపాదించిన మొత్తంలో నుంచి పొదుపు, పెట్టుబడులకు కొంత కేటాయిస్తుంటాం. కుటుంబానికి ఆర్థికంగా అవసరమైన లక్ష్యాల సాధనకు ఇవి ఉపయోగడేలా చూసుకుంటాం. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ